వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండెక్కిన కూరగాయాల ధరలు: కిలో రూ.60 నుంచి రూ.120..ఆకు కూరలు కూడా..

|
Google Oneindia TeluguNews

ఏం కొనెట్టు లేదు.. ఏం తినెట్టు లేదు.. అవును 'ఎర్రొడు' సినిమాలో పాట మాదిరిగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఏ కూరగాయ ముట్టుకున్న రేటు విని గుండే గుబెల్ మంటోంది. హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్ వద్ద కిలో రూ.60 ఉన్నాయంటే.. ఇక పట్టణాలు/ గ్రామాల సంగతి చెప్పక్కర్లేదు. మధ్యవర్తులు/ దళారుల చేతిలో చిక్కి ధర ఆమాంతం పెరిగిపోతోంది. దీంతో మారుమూల పల్లెల్లో కూరగాయాలు కొనాలంటేనే సామాన్యుడు వణికే పరిస్థితి నెలకొంది.

Recommended Video

Onion wholesale and retail prices doubled | Oneindia Telugu
కిలో రూ.60కి తక్కువ లేదు..

కిలో రూ.60కి తక్కువ లేదు..

ఎర్రగడ్డ మార్కెట్ వద్ద ఏ కూరగాయ అయినా రూ.60 పలుకుతోంది. ఇక క్యారెట్, క్యాప్సిక్ అయితే రూ.80 వరకు విక్రయిస్తున్నారు. అంతేందుకు బంగాళాదుంప కూడా రూ.50కి చేరింది. అంతకుముందు రూ.30కి విక్రయించేవారు. బీట్‌రూట్, క్యాప్సికం, చిక్కుడు కాయ, గోకరకాయ రూ.65 నుంచి రూ.75కి విక్రయించారు. ఇక బహిరంగ మార్కెట్/ షాపుల్లో రూ.10 నుంచి 30 వరకు ఎక్కువగానే అమ్ముతారు. అంటే ఒక విజిటేబుల్ కిలో కోసం రూ.100 ఇవ్వాల్సిందే. నాలుగు రకాలు కావాలంటే రూ.400 వెచ్చించాల్సిన పరిస్థితి.

ఆకుకూరలు కూడా..

ఆకుకూరలు కూడా..

కొత్తిమీర కూడా ధర పెరిగింది. కరివేపాకు, పుదీనా కట్టల గురించి అయితే చెప్పక్కర్లేదు. మెంతి కూర, పుంటికూర, చుక్కకూర. పాలకూర, తోటకూర ఇదివరకు రూ.10కి నాలుగైదు కట్టలు ఇచ్చేవారు. ధర పెరిగినందున 2 కట్టలు మాత్రమే ఇస్తున్నారు. ఇక ఉల్లిగడ్డ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కిలో రూ.49 వరకు విక్రయిస్తున్నారు. షాపుల్లో అయితే రూ.50 నుంచి రూ.60 వరకు సేల్ చేస్తున్నారు.

 పట్టణాల్లో అయితే మరీ దారుణం..

పట్టణాల్లో అయితే మరీ దారుణం..

నగరాలు/ పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కూరగాయాలు సాగు చేయని గ్రామాల్లో అయితే చెప్పక్కర్లేదు. విజిటేబుల్స్ కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక్కడ దాదాపు కిలోకు రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యుడు కూరగాయాలు కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు అని చెబుతున్నాడు.

 ధరల పెరుగుదలకు కారణమిదే..

ధరల పెరుగుదలకు కారణమిదే..

కూరగాయాల ధరల పెరుగుదలకు కారణం ఆకాల వర్షం అని తెలుస్తోంది. వర్షం వల్ల పంటలే కాక కూరగాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో మార్కెట్‌కు రావాల్సిన కూరగాయాలు రాలేదు. కొరత కారణంగా ధరలు ఆమాంతం పెరిగేశాయి. అయితే వాటి ధర ఇప్పట్లో తగ్గవని.. కొత్త క్రాప్ వచ్చేవరకు ఇలానే పరిస్థితి ఉంటుందనే కొందరు అంటున్నారు.

English summary
vegetable rates are hike in the state and other states also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X