• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విధేయతే మంత్రిని చేసింది: తెలంగాణ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి ప్రొఫైల్

|

హైద‌రాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజ‌క వ‌ర్గం నుండి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వేముల ప్ర‌శాంత్ రెడ్డి మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. బీఈ సివిల్ ఇంజ‌నీరింగ్ చేసిన ప్ర‌శాంత్ రెడ్డి పార‌శ్రామిక వేత్త‌గా స్థిర ప‌డ్డారు. 2014 లో బాల్కొండ నియోజ‌ర వ‌ర్గం నుండి పోటీ చేసిన ఆయ‌న స‌మీప ప్ర‌త్య‌ర్ధి కాంగ్రెస్ పార్టీ అనిల్ పైన సుమారు 32వేల 897ఓట్ల‌తో గెలుపొందారు. ఇక 2018లో జ‌రిగిన తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కూడా త‌న హ‌వాను కొన‌సాగించారు ప్ర‌శాంత్ రెడ్డి. 2018లో త‌న ప్ర‌త్య‌ర్థి ముత్యాల సునిల్ కుమార్ పై 32,459ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. మొద‌టి నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు కు అత్యంత స‌న్నిహితంగా ఉండే ప్ర‌శాంత్ రెడ్డి తెలంగాణ రెండ‌వ మంత్ర‌వ‌ర్గంలో చోటు సంపాదించుకోగ‌లిగారు.

మంత్రి వ‌ర్గంలోకి వేముల ప్ర‌శాంత్ రెడ్డి..! విన‌య విధేయ‌త‌లే కార‌ణం..!!

మంత్రి వ‌ర్గంలోకి వేముల ప్ర‌శాంత్ రెడ్డి..! విన‌య విధేయ‌త‌లే కార‌ణం..!!

నిజామా బాద్ జిల్లా బాల్కొండ వాకిట్లో మరొక కాబినెట్ పదవి వచ్చింది. ఇప్ప‌టికే పోచారం శ్రీ‌నివాస రెడ్డి కేబినేట్ హోదాలో ఉన్నారు. తాజాగా బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కి మంత్రిగా పదవి ద‌క్కింది. అంతే కాకుండా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె కార్పొరేషన్ (మిషన్ భగీరథ) వైస్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వ్య‌వ‌హిరిస్తున్న విష‌యం తెలిసిందే..! తెలంగాణ మంత్రి మండ‌లిలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కి చోటు ల‌భించింద‌ని తెలియ‌డంతో ఆయ‌న వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

వ్రుత్తి ప‌రంగా బిల్డ‌ర్..! రాజ‌కీయాల్లో అనూహ్యంగా రానించిన ప్ర‌శాంత్ రెడ్డి..!!

వ్రుత్తి ప‌రంగా బిల్డ‌ర్..! రాజ‌కీయాల్లో అనూహ్యంగా రానించిన ప్ర‌శాంత్ రెడ్డి..!!

స్వతహగా సివిల్ ఇంజనీర్ అయిన వేముల ప్రశాంత్‌రెడ్డి, గోదావరి పుష్కరాలకు ,చండియాగం యొక్క పనులు దగ్గరుండి నడపడంతో కెసిఆర్ కి బాగా దగ్గరయ్యారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వాళ్ళ తండ్రి వేముల సురేందర్ రెడ్డి తెరాస లో సీనియర్ నాయకుడు ,మాజీ నిజాం సుగర్స్ సంగం అద్యక్షుడుగా ఎన్టీఆర్ హయంలో పనిచేసారు. ఇపుడు వేముల ప్రశాంత్‌రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు నిరూపించుకుంటున్నారు. 14-3 1968లో వేల్పూర్ లో జ‌న్మించిన ప్ర‌శాంత్ రెడ్డి 2001లో చంద్ర‌శేఖ‌ర్ రావు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి లో చేరిపోయారు.

గ్రామ చరిత్ర- జ‌నాబా

గ్రామ చరిత్ర- జ‌నాబా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3720 ఇళ్లతో, 15644 జనాభాతో 2108 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7497, ఆడవారి సంఖ్య 8147. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1967 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 489. యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించి తన కాశీ యాత్ర చరిత్రలో వర్ణించారు.1830 నాటికే బాల్కొండ చాలా అన్ని వసతులు కలిగి, నగరాన్ని తలపిస్తోందని వీరాస్వామయ్య రాసుకున్నారు.

 విద్యా సౌకర్యాలు..! అక్ష‌రాస్య‌త‌

విద్యా సౌకర్యాలు..! అక్ష‌రాస్య‌త‌

గ్రామంలో ఐదుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల చేపూర్లో ఉంది. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ నిజామాబాద్లోను, మేనేజిమెంటు కళాశాల ఆర్మూర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నిజామాబాద్లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఆర్మూర్ లోనూ ఉన్నాయి. నిజామాబాదు జిల్లా మండ‌ల కేంద్ర‌మైన బాల్కొండ‌లో 20027 గ్రామాలు ఉండ‌గా, జనాభా (2011) లెక్క‌ల ప్ర‌కారం 38,801 మంది పురుషులు, 42,202 మంది స్త్రీలు ఉన్నారు. 2011 లెక్క‌ల ప్ర‌కారం మొత్తం 68.31% అక్షరాస్యత ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 నియోజకవర్గ ప్రముఖులు..! మ‌హానుభావులు..!!

నియోజకవర్గ ప్రముఖులు..! మ‌హానుభావులు..!!

కాంగ్రేసు పార్టీలో అగ్రనేత అయిన రాజారాం తొలిసారి సోషలిస్టుగా ఆర్మూరు నుండి శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత 1962 నుండి బాల్కొండ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1967లో రాజారాం బాల్కొండ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికకావటం విశేషం. ఈయన 1974లో జలగం వెంగళరావు, 1978 తర్వాత చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశాడు. 1981లో రోడ్డుప్రమాదంలో ఈయన మరణించిగా జరిగిన ఉప ఎన్నికలలో ఈయన సతీమణి సుశీలాదేవి శాసనసభకు ఎన్నికైంది.

English summary
Vimula Prasanth Reddy, who represents the Balakonda constituency in Nizamabad district, was sworn in as the minister. Prasanth Reddy, who has been BE civil engineer, has been settled as a builder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X