వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ... నేటి నుండి ఐదురోజుల పాటు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కల్యాణ ఉత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలను నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఆపరేషన్ కమల రూ. 30 కోట్లు ఆఫర్, నిజం కాదు అంటున్న జేడీఎస్ ఎమ్మెల్యే, ఏసీబీ విచారణలో!
నేటి నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు విశేష సేవలు జరుపుతున్నారు . 23వ తేదీన శ్రీ పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం భక్త జన సందోహం నడుమ అట్టహాసంగా జరుగుతోంది. స్వామివారి కల్యాణానికి ముందు ఎదుర్కోలు ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. 25వ తేదీన రాత ప్రతిష్ఠలతోపాటు, స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. అదే రోజున వసంతోత్సవం సైతం చాలా ఘనంగా నిర్వహిస్తారు.
26వ తేదీన చివరి రోజున పూర్ణాహుతి, ఏకాంతసేవలతో స్వామి వారి ఉత్సవాలు ముగుస్తాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం రాజరాజేశ్వర దేవాలయ అధికారులు ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేశామని రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఈవో దుస్సా రాజేశ్వర్ తెలిపారు.