వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేములవాడలో స్కూల్ సీజ్.. వ్యాన్ బోల్తా ఘటనలో చర్యలు

|
Google Oneindia TeluguNews

వేములవాడ : బుధవారం నాడు ముగ్గురు విద్యార్థుల మృతికి కారణమైన వాగేశ్వరి స్కూల్ యాజమాన్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఆ మేరకు స్థానిక ఎంఈవో పాఠశాలను సీజ్ చేస్తూ తాళం వేశారు. అసలు ఆ స్కూల్ వ్యాన్‌కు ఎలాంటి అనుమతి లేదంటూ తేల్చేశారు. ఇష్టారాజ్యంగా స్కూల్ నడుపుతున్నారంటూ వాగేశ్వరి స్కూల్ పై చర్యలు తీసుకున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లో స్కూల్ నిర్వహిస్తున్న విషయంలో ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు ఎంఈవో.

అదలావుంటే బుధవారం నాడు తప్పతాగి స్కూల్ వ్యాన్ నడుపుతూ ముగ్గురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్న డ్రైవర్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేయిస్తున్నారు. వేములవాడ శివారులో బుధవారం నాడు స్కూల్ వ్యాన్ బోల్తా పలు అనుమానాలకు తావిచ్చింది. ముగ్గురు విద్యార్థులను పొట్టన బెట్టుకున్న ఈ యాక్సిడెంట్ స్కూల్ యజమాన్యం నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది. బస్సుకు అసలు ఫిట్‌నెస్ ఉందా అనేది పెద్ద ప్రశ్నలా మారింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే విషయం గ్రహించి స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

vemulawada vageshwari school seized by MEO

మైనర్ బాలికలతో ఆడుకుంటున్న మరో రెడ్డి.. జడ్చర్లలో టెన్త్ క్లాస్ విద్యార్థిని దారుణ హత్య..!మైనర్ బాలికలతో ఆడుకుంటున్న మరో రెడ్డి.. జడ్చర్లలో టెన్త్ క్లాస్ విద్యార్థిని దారుణ హత్య..!

ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి ఈటల రాజేందర్ హుటాహుటిన అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురికి ప్రభుత్వం తరపున ఉచిత వైద్య సాయం అందిస్తామని తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గాయపడిన విద్యార్థులు కూడా పేద కుటుంబానికి చెందినవారని.. వారి వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వం భరించాలని సూచించారు. మొత్తానికి ముగ్గురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్న స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిపై కొరడా ఝలిపించి పాఠశాలను సీజ్ చేయడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

English summary
Authorities have become serious over the owners of the Vemulawada Vageshwari School, which has resulted in the death of three students. To that end, the local MEO siezed the school. He declared that There was no permission for the school van. The management has already issued notices to the school in the commercial complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X