వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘మేడారం జాతర’ మర్చిపోలేని జ్ఞాపకం: పులకించిపోయానని రాజ్యసభలో వెంకయ్య

|
Google Oneindia TeluguNews

Recommended Video

Medaram Jatara : మేడారంలో వెంకయ్య, కేసీఆర్ : వీడియో

న్యూఢిల్లీ: తెలంగాణలోని మేడారంలో ఇటీవల నిర్వహించిన అతిపెద్ద గిరిజన జాతర మరిచిపోలేని జ్ఞాపకమని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. గత శుక్రవారం తాను సభకు రాలేదని.. జాతర సందర్శనార్థం ఆ ప్రాంతానికి వెళ్లానని.. ఆ సందర్భంగా తాను ఎంతో పులకరించిపోయానని రాజ్యసభలో సోమవారం వెంకయ్యనాయుడు తన అనుభూతిని సభ్యులతో పంచుకున్నారు.

అద్భుతం, అందుకే వచ్చా: మేడారంలో వెంకయ్య, కేసీఆర్(పిక్చర్స్)అద్భుతం, అందుకే వచ్చా: మేడారంలో వెంకయ్య, కేసీఆర్(పిక్చర్స్)

కోట్లాది మంది గిరిజనులు, ప్రజలు పాల్గొనే ఈ మినీ కుంభమేళాకు ఎనిమిది రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని వెంకయ్య వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారని చెప్పారు.

venkaiah naidu about Medaram Jatara in Rajya sabha

ఎంతో క్రమశిక్షణ, భక్తిభావంతో జాతర నిర్వహించారని అన్నారు. కాగా, మేడారం జాతరకు వచ్చిన సందర్భంలో వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివాసీ కుంభమేళ మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. మేడారానికి వచ్చి అవతార మూర్తలను దర్శించకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆది,వేద కాలం నుంచి వస్తున్న ఆచారాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
Vice President venkaiah Naidu explained about Medaram Jatara in Rajya Sabha on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X