హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

18 ఏళ్ల యువతి, అందరి కళ్లూ..: వెంకయ్య నాయుడు, కెటిఆర్‌కు ఇలా

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

NMDC diamond jubilee fete : Venkaiah Naidu praises Hyderabad

హైదరాబాద్: హైదరాబాదు నగరాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు 18 ఏళ్ల యువతిగా అభివర్ణించారు. ప్రపంచం కళ్లన్నీ హైదరాబాదు మీదే ఉన్నాయని, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

హైదరాబాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోందని, దాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఐటి శాఖ మంత్రి కెటి రామారావుపై ఉంది ఆయన అన్నారు. హైదరాబాద్ దేశంలోనే చార్మింగ్, హ్యాపెనింగ్ సిటీ అని ఆయన అన్నారు.

 హైదరాబాద్ బిర్యానీపై వెంకయ్య

హైదరాబాద్ బిర్యానీపై వెంకయ్య

హైదరాబాద్ బిర్యానీ గురించి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిందని చెప్పారు. శుక్రవారం మాదాపూర్ శిల్పాకళావేదికలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఉక్కు కర్మాగారాలు రావాలి...

ఉక్కు కర్మాగారాలు రావాలి...

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు ఉక్కు కర్మాగారాలు రావాల్సి ఉందని, ఒకటి బయ్యారంలో మరోటి కడపలో ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. దీనిపై ఉక్కు శాఖ త్వరలో నివేదిక ఇస్తుందని తెలిపారు. ఆ తర్వాత ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

బుల్లెట్‌కన్నా బ్యాలెట్ బలమైనది

బుల్లెట్‌కన్నా బ్యాలెట్ బలమైనది

బుల్లెట్‌కన్నా బ్యాలెట్ బలమైందని వెంకయ్య నాయుడు అన్నారు. మవోయిస్టులు తమ లక్ష్యాల సాధనకు బ్యాలెట్ విధానాన్ని ఎంచుకోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అన్నారు. గిరిజనులకు చదువుకునే అవకాశం కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారని అంటూ ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతానికి చెందిన గిరిజన యువతి యూపీఎస్సీ పరీక్షల్లో 99 శాతం మార్కులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.

 ఎన్ఎండీసి అంటే ఇదీ...

ఎన్ఎండీసి అంటే ఇదీ...

ఎన్‌ఎండీసీ అంటే నేషన్స్ మెయిన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ అని వెంకయ్య నాయుడు అన్నార. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ప్రాంతీయ అసమానతలు తొలిగించేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వరంగ సంస్థలను అప్పటి ప్రధాని నెహ్రూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పారు.

నెలలో బయ్యారంపై నివేదిక

నెలలో బయ్యారంపై నివేదిక

ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేశామని, ఈ కమిటీ సాధ్యసాధ్యాలపై నెలలో నివేదిక ఇస్తుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ తెలిపారు. గనుల రంగంలో ఛత్తీస్‌గఢ్‌కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.

English summary
Vice president Venakaih Naidu said that Hyderabad is the most happening and charming city of the country. He compared the capital city to 18-year-old girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X