హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha murder case: శంషాబాద్ హైవేపై మద్యం దుకాణాలను మూసేయాలంటూ.. !

|
Google Oneindia TeluguNews

హైదరాబాాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలను పుట్టిస్తోన్న వెటర్నిరి డాక్టర్ దిశ హత్యోదంతం సందర్భంగా శంషాబాద్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా- జాతీయ రహదారిపై ఉన్న మద్యం దుకాణాలను మూసి వేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వెటర్నరి డాక్టర్ దిశపై నలుగురు కామాంధులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి,, హతమార్చడానికి మద్యం కూడా ఓ కారణమేనని, ఆ మహమ్మారిని వెంటనే తరిమి కొట్టాలని పట్టుబడుతున్నారు.

Tirupati Shirdi Express: పట్టాలు తప్పిన తిరుపతి-షిర్డీ ఎక్స్ ప్రెస్.. !Tirupati Shirdi Express: పట్టాలు తప్పిన తిరుపతి-షిర్డీ ఎక్స్ ప్రెస్.. !

శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ మధ్య సుమారు అయిదుకు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి. రెండు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వాటిల్లో సగానికి పైగా మద్యం దుకాణాలు హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారికి ఆనుకునే కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి కావడంతో నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రిళ్లు కూడా మద్యం దుకాణాలను తెరచి ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు.

Veterinary Doctor Disha murder case: Residents of Shamshabad ask to shut liquor shops on high ways

వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారానికి పాల్పడిన కిరాతకులు మహమ్మద్ పాషా, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి ముందు ఆ దుకాణాల నుంచే మద్యాన్ని కొనుగోలు చేశారని స్థానికులు చెబుుతున్నారు. కామాంధుల చేతుల్లో డాక్టర్ దిశ బలి కావడానికి మద్యం కూడా ఓ కారణమని, వెంటనే ఆయా దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం పాలసీ ప్రకారం.. రాత్రి 11 గంటల వరకూ దుకాణాలను తెరిచి ఉంచడానికి వెసలుబాటు ఉంది.

అయినప్పటికీ- గడువు దాటిన తరువాత కూడా మద్యం దుకాణాలను తెరిచే ఉంచుతున్నారని విమర్శిస్తున్నారు. శంషాబాద్ లో 18 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయని తెలంగాణ వైన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఎనిమిది వార్డులను విలీనం చేసి, ఓ క్లస్టర్ గా ఏర్పాటు చేసిందని, క్లస్టర్ పరిధిలో ఏ ప్రాంతంలోనైనా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసే వీలు ఉన్నందున.. జాతీయ రహదారులపై అధికంగా వాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో వార్డులో నాలుగు వరకు మద్యం దుకాణాలు ఉండొచ్చంటూ మద్యం పాలసీలో పొందుపరిచారని చెప్పారు.

English summary
The new liquor policy has enabled five liquor shops to open in a two-kilometre radius of the Tondupally toll plaza in Shamshabad, where a veterinarian now known as Disha was brutally raped and murdered. Residents in the vicinity claimed that the area has become unsafe and women are living in constant panic. They claim that the liquor shops near the toll plaza encourage commuters to stop and drink liquor which can lead them to commit heinous crimes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X