హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకినాడలో కాంగ్రేస్ నేత వీహెచ్ ధర్నా , !

|
Google Oneindia TeluguNews

హైద్రబాద్ లో రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానలు ఆంధ్ర ప్రజల కూడ తెలియచేసేందుకు కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కాకినాడలో ధర్నా చేయనున్నట్టు తెలిపారు. హైద్రబాద్ , పంజాగుట్ట సర్కిల్ వద్ద స్థాపించాలనుకున్న అంబేద్కర్ విగ్రహం డంప్ యార్డ్ కు చేరిన విషయం తెలిసిందే,

VH Dharna at kakinada,

దీంతో పలు దళిత సంఘాలు , రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టారు .కాగా ఇదే అంశంపై ఆందోళన చేస్తున్న పలు దళిత నేతలను సైతం తెలంగాణ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. దీంతో తెలంగాణలో బాద్యులను శిక్షించేందుకు ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి పార్టీలు . ఈనేపథ్యంలోనే వి.హనుమంతరావు ఇదే విషయంపై ఆంధ్ర ప్రదేశ్ లో కూడ ఆందోళన కొనసాగించాలని భావించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబెద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. దీని ద్వార ఆంధ్రప్రదేశ్ లో దళితులు,బీసీ లను కూడ అందోళనను ఉదృతం చేస్తానని చెప్పారు.

కాగా వీహెచ్ ఇదే విషయంలో స్వంత పార్టీ అధినేత తెలంగాన రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడ తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అయితే ఆయన ఉత్తమ్ పట్టించుకోవడం లేదని ఆయన రాజకీయాల మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు.ఎస్సీ ,బీసీ ఓట్లు కావాలి కాని వారి సమస్యలు పట్టవా అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు .దీంతో ఉత్తమ్ సైతం అంబేద్కర్ విగ్రహ ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించాల్సి వచ్చింది.

English summary
senior congress leader v. hanumantarao annouced that he is going to take dharna in kakinada of andrapradesh,to know the people of ap of Br ambedker statue destroy in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X