హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పవన్ కళ్యాణే కేసీఆర్‌ను అడిగారు', డ్రగ్స్ మాఫియా కోసమే: విహెచ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవడంపై అధికార టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం మాట్లాడారు. వారి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణే ఇటీవల కేసీఆర్ అపాయింటుమెంట్ కోరారని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ గురించి పవన్ ప్రశంసించారని, ఇరవై నాలుగు గంటల కరెంట్ ఘనత కేసీఆర్‌దే అని ఆయన స్పష్టం చేశారు. కాగా, సోమవారం పవన్ తొలిసారి ప్రగతి భవన్‌కు రావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే.

షాకింగ్: 'ప్రగతి భవన్ వద్ద పవన్ కళ్యాణ్ పడిగాపులు', కిరణ్ రెడ్డిని లాగిన జనసేనానిషాకింగ్: 'ప్రగతి భవన్ వద్ద పవన్ కళ్యాణ్ పడిగాపులు', కిరణ్ రెడ్డిని లాగిన జనసేనాని

అప్పటి దాకా అధికారులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్

అప్పటి దాకా అధికారులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ వచ్చారు. సాయంత్రం 6గంటలకు కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చారు. సీఎం కార్యాలయ అధికారులు కేసీఆర్‌కు సమాచారం ఇవ్వగానే ఆయన స్పందించి, పవన్‌ను తన నివాస భవనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. గంట తర్వాత కేసీఆర్‌ రాగా అప్పటి వరకు పవన్‌ సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు.

పవన్! కేసీఆర్ వేలకోట్ల దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్‍‌వా, కేటీఆర్ నిన్ను ఏమన్నారు: రేవంత్పవన్! కేసీఆర్ వేలకోట్ల దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్‍‌వా, కేటీఆర్ నిన్ను ఏమన్నారు: రేవంత్

ఇంటిని ఇష్టపడి తీసుకున్నారని చమత్కారం

ఇంటిని ఇష్టపడి తీసుకున్నారని చమత్కారం

సీఎం రాగానే పవన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు, తెరాస నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు పరిచయం చేశారు. పల్లా తమ ఇంటిని కొనుగోలు చేశారని పవన్‌ కళ్యాణ్ చెప్పగా, మీ ఇల్లు ఆయన ఇష్టపడి తీసుకున్నారని కేసీఆర్‌ చమత్కరించారు. అయితే ఈ భేటీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు.

అప్పుడే అనుమానం వచ్చింది

అప్పుడే అనుమానం వచ్చింది

కాంగ్రెస్ పార్టీ నేత వి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికే తెలంగాణ ఆదర్శమని పవన్ అన్నారని, ఏ విషయంలో ఆదర్శమో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రపతి కార్యక్రమంలో కేసీఆర్, పవన్‌లు కలిసినప్పుడు తనకు అనుమానం వచ్చిందని చెప్పారు.

డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే కలిశారు

డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే కలిశారు

డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకు కేసీఆర్‌ను పవన్ కలిశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌పై ఛార్జీషీటు ఎందుకు వేయలేదో చెప్పాలన్నారు. తెరాస ప్రభుత్వంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారని, పవన్‌కు దమ్ముంటే తనతో వస్తే రైతుల వద్దకు తీసుకు వెళ్తానని చెప్పారు.

English summary
Telangana Congress leader V Hanumantha Rao hot comments on Jana sena chief Pawan Kalyan and Telangana Chief Minister K Chandrasekhar Rao meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X