వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని గాంధీతో పోలుస్తారా, పెళ్లయినా బాధ్యతలు తెలియవు: విహెచ్

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో పేదలకు ఒరిగిందేమీ లేదని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంత రావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

జనగామ: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో పేదలకు ఒరిగిందేమీ లేదని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంత రావు అన్నారు. నోట్ల రద్దుపై రాహుల్ గాంధీ సూచనలు మేరకు నిర్వహిస్తున్న ప్రచార యాత్రలో భాగంగా ఆయన మంగళవారం జిల్లా కేంద్రమైన జనగామ ప్రధాన చౌరస్తాలో మాట్లాడారు.

పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధాని మోదీ పేదలపై సర్జికల్‌ స్ట్రయిక్స్ చేశారన్నారు. నోట్ల రద్దుతో పేదలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డిసెంబరు 31 తర్వాత ఏదో చేస్తారని భావించిన పేదలకు నిరాశే మిగిలిందన్నారు.

<strong>నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'</strong>నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'

నోట్ల రద్దు అనంతరం దేశంలో 120 మంది పేదలు చనిపోతే వారి పట్ల సానుభూతి ప్రకటించి పరిహారం ఇవ్వాలన్న కనీస జ్ఞానం మోడీకి లేకుండా పోయిందన్నారు. అమెరికా లాంటి సంపన్న దేశాలలోనే 60 శాతం నగదుతోనే లావాదేవీలు జరుగుతున్నాయని, అలాంటిది భారత్‌లో ఇది ఎలా సాధ్యమన్నారు.

 VH lashes out at PM Modi over demonetisation

కొందరు బీజేపీ నాయకులు మోడీని మహత్మా గాంధీతో పోల్చుతున్నారని, ఆయన కాలి గోటికి కూడా మోడీ సరిపోరన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మోడీతో రహస్య ఒప్పందం చేసుకుని నోట్ల రద్దుపై మాట్లాడడం లేదన్నారు. పీసీసీ కార్యదర్శి అజ్మతుల్లా హుస్సేన్‌, డీసీసీబీ ఛైర్మన్‌ జంగా రాఘవ రెడ్డి పాల్గొన్నారు.

కేంద్రం దివాళాకోరు విధానంతో 58 రోజులుగా సామాన్య ప్రజల బతుకులు దుర్భరమయ్యాయన్నారు. పేదలు, రైతులు చేతిలో చిల్లిగవ్వలేక విలవిల్లాడుతున్నారన్నారు. మోడీ నల్ల కుబేరులు అందించే లంచాలతో జల్సాలు చేస్తున్నారన్నారు.

బడా పారిశ్రామికవేత్తల మేలు కోసం కోట్లాది రూపాయలు తీసుకుని మోడీ నోట్ల రద్దు లాంటి దుస్సాహసానికి పాల్పడ్డారన్నారు. అవినీతిపై రాహుల్ సంధించిన ప్రశ్నలకు దమ్ముంటే మోడీ సమాధానం చెప్పాలన్నారు.

మోడీకి పెళ్లయినా సంసార బాధ్యతలు తెలియని అవివేకిలా వ్యవహరిస్తున్నారన్నారు. సంసారం, పిల్లలు ఉంటే తల్లిని దగ్గరుండి ఆధరిస్తే పేద ప్రజల బాధలు తెలిసేవన్నారు. దుష్టపాలన సాగిస్తున్న మోడీతో దేశ ప్రయోజనాలకు విఘాతం అన్నారు.

English summary
V Hanumantha Rao lashes out at PM Modi over demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X