వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాస్ హత్య: తెరాస ఎమ్మెల్యే వీరేశంపై విహెచ్ సంచలనం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సంఘటన విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనభ్యుడు వేముల వీరేశంపై కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్య చేశారు.

Recommended Video

శ్రీనివాస్ హత్య సూత్రధారి TRS ఎమ్మెల్యే !

వేముల వీరేశాన్ని ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన అన్నారు. హత్యా రాజకీయాల కోసం తెలంగాణ రాలేదని ఆయన అన్నారు. నయీం మాదిరిగానే వీరేశం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 వీరేశం నయీం కన్నా ఎక్కువ...

వీరేశం నయీం కన్నా ఎక్కువ...

తెరాస శాసనసభ్యుడు వేముల వీరేశం నయీం కన్నా ఎక్కువ అని కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. వీరేశం ఫోన్ కాల్ లిస్టు చూస్తే వాస్తవాలు బయటపడుతాయని ఆయన అన్నారు. తన కాల్ లిస్టు చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

నకిరేకల్ వైపు పారిపోయారు...

నకిరేకల్ వైపు పారిపోయారు...

బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు నకిరేకల్ వైపు పారిపోయారని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.మూడేళ్లుగా ప్రాణహాని ఉందని చెబుతున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తనకు కూడా ప్రాణహని ఉందని ఆయన అన్నారు. పోలీసు అధికారులు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

గన్ మ్యాన్ కావాలని అడిగినా...

గన్ మ్యాన్ కావాలని అడిగినా...

తన ప్రాణాలకు హాని ఉందని, గన్‌మ్యాన్‌ను ఇవ్వాలని అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను తెరాస కార్యకర్తలే హత్య చేశారని ఆయన అన్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భద్రత పెంచాలని డిజిపికి లేఖ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

 హత్యతో తెరాసకు సంబంధం లేదు

హత్యతో తెరాసకు సంబంధం లేదు

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తమ పార్టీకి సంబంధం లేదని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. ఏ ఘటన జరిగినా తెరాకు ఆపాదించడం కాంగ్రెసుకు అలవాటుగా మారిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ హత్యకు జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యే వీరేశం బాధ్యత వహింంచాలనడం అర్థం లేనిదని ఆయన వ్యాఖ్యానించారు.

ఏ విచారణకైనా సిద్దం...

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు కర్నె ప్రభాకర్ తెలిపారు. శ్రీనివాస్‌ను హత్య చేసినవారుర కాంగ్రెసు పార్టీలోనే క్రియాశీలకంగా ఉన్నారని, ఫొటోలే విచారణకు ప్రామాణికమైతే నిందితులంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫొటోలు దిగారని ఆయన అన్నారు. వీరేశం కాల్ లిస్టు బయటపెట్టేందుకు అభ్యంతరం లేదని, కోమటిరెడ్డి ఫోన్ కాల్ లిస్టు కూడా బయటపెట్టాలని ఆయన అన్నారు.

English summary
Telangana Congress senior leader V Hanumanth Rao has made controversial comments on TRS MLA Vemula Veeresham in Boddupalli Srinivas murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X