హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఐపై తిట్ల పర్వంపై కేసు: గాంధీ విగ్రహం వద్ద విహెచ్ ధర్నా, అరెస్టు

ఓ ఇన్‌స్పెక్టర్‌పై కాంగ్రెసు సీనియర్ నేత అసభ్య పదజాలంతో విరుచకుపడినట్లు ఆరోపిస్తూ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ విహెచ్ ధర్నాకు దిగి, అరెస్టయ్యారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావును హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని సోమాజీగూడ రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద వీహెచ్‌ పలువురు కాంగ్రెస్‌ నేతలతో కలిసి శనివారం ధర్నా చేస్తుండగా పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.

మూడు రోజుల క్రితం అసెంబ్లీ ప్రాంగణంలో ఓ పోలీస్ అధికారిని తాను తిట్టానంటూ తనపై అసత్య అరోపణల మోపి కేసు న‌మోదు చేశార‌ని ఆరోపిస్తూ వీహెచ్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. తాను ఎవరినీ తిట్టలేదని ఆయ‌న‌ తెలిపారు. తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని వీహెచ్‌ అన్నారు.

VH staged dharna at gandhi statue, arrested

ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. అసభ్య పదజాలంతో తిట్టిపోశారు. "అరే.. నువ్వు ఎవడ్రా బై నాకు చెప్పేది!. నన్నే అడ్డుకుంటావా?. ఆరేయ్‌.. నీ అంతు చూస్తా" అంటూ తిట్టిపోశారు. డ్యూటీలో ఉన్న ఓ ఇన్‌స్పెక్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.

సాక్షాత్తూ అసెంబ్లీ ఆవరణలో, మీడియా పాయింట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన మర్నాడు గానీ వెలుగులోకి రాలేదు. మీడియాతో మాట్లాడేందుకు పాయింట్‌ వద్దకు వీహెచ్‌ వచ్చారు. అందుకు అనుమతి లేదంటూ అక్కడ విధుల్లో ఉన్న కామాటిపుర అదనపు ఇన్‌స్పెక్టర్‌ పాములపర్తి సుధాకర్‌ అడ్డుకున్నారు. దాంతో వీహెచ్‌ విశ్వరూపం ప్రదర్శించారు.

మీడియా పాయింట్‌ వద్ద ప్రస్తుత సభ్యులే మాట్లాడాలని, మాజీలకు అవకాశం లేదని, అందువల్ల వెళ్లిపోవాలని సుధాకర్‌ మర్యాదపూర్వకంగా చెప్పినా వీహెచ్‌ వినిపించుకోలేదు. 'మేం మాట్లాడానికి కూడా మీ అనుమతి తీసుకోవాలా?. ఇదేనా ప్రజాస్వామ్యం?.' అంటూ మండిపడ్డారు.

తిట్ల వర్షంతో మనస్తాపం చెందిన సుధాకర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత తన వేదనను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. "దళితుడిని అయినందుకే వీహెచ్‌ నన్ను దూషించారు. అసభ్యకర వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందాను. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా. కానీ, ఎలాంటి స్పందన రాలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నాను" అని పోస్టు చేశారు.

ఇరవై ఏళ్ల సర్వీసులో ఎలాంటి ఆరోపణలు లేకుండా విధులు నిర్వహించానని, ఎప్పుడూ ఇలాంటి అవమానం జరుగలేదని అన్నారు. డ్యూటీలో ఉన్న తనను దూషించిన వీహెచ్‌పై శుక్రవారం సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ఐపీసీ 353, 294-బి, 504 సెక్షన్ల కింద వీహెచ్‌పై కేసు నమోదు చేశారు.

English summary
VH arrested for staging dharna at Gandhi statue in Hyderabad. The former Rajya Sabha member V. Hanumanth Rao, who has courted controversy in the past, was caught on camera warning a police officer after being stopped from entering the "Media Point" on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X