వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైస్ మిల్లర్ల నుండి లంచం తీసుకొంటూ పట్టుబడ్డ విజిలెన్స్ ఎస్ పి

అవినితీ, అక్రమాలు జరగకుండా చూడాల్సిన విజిలెన్స్ ఎస్ పి లంచం తీసుకొంటూ ఎసిబి అధికారులకు గురువారం నాడు పట్టుబట్టాడు. విజిలెన్స్ లో ఎస్ పి స్థాయి అధికారి లంచం తీసుకొంటూ పట్టుబడడం ,

By Narsimha
|
Google Oneindia TeluguNews

నల్గొండ :అవినితీ, అక్రమాలు జరగకుండా చూడాల్సిన విజిలెన్స్ ఎస్ పి లంచం తీసుకొంటూ ఎసిబి అధికారులకు గురువారం నాడు పట్టుబట్టాడు. విజిలెన్స్ లో ఎస్ పి స్థాయి అధికారి లంచం తీసుకొంటూ పట్టుబడడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

నల్లగొండ విజిలెన్స్ ఎస్ పి గా భాస్కర్ రావు పనిచేస్తున్నాడు. జిల్లాలోని రైస్ మిల్లర్ వ్యాపారులను భాస్కర్ రావు కొంత కాలంగా లంచం అడుగుతున్నాడు. 12 మంది రైస్ మిల్లు వ్యాపారులను లంచం డిమాండ్ చేస్తున్నాడు.

vigillance sp caught taking bribe from ricemillers

పెద్ద నగదు నోట్లు రద్దు చేయడంతో పాటు వ్యాపారాలు సక్రమంగా సాగడం లేదని వ్యాపారులు చెప్పినా విజిలెన్స్ ఎస్ పి భాస్కర్ రావు వినలేదు. తాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నాడు.

రైస్ మిల్లర్స్ కొందరు విజిలెన్స్ ఎస్ పి లంచం డిమాండ్ చేయడంతో ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిబి అధికారులు ఇవాళ ఆయనను వలపన్ని పట్టుకొన్నారు.

తన ఇంట్లోనే లక్ష రూపాయాలను రైస్ మిల్లర్ల నుండి భాస్కర్ రావు తీసుకొంటుండగా వలపన్ని ఎసిబి అధికారులు పట్టుకొన్నారు. భాస్కర్ రావు ఇంటితో పాటు ఆయన స్వంత జిల్లా వరంగల్ తో పాటు ఆయన బంధువుల ఇళ్ళలో కూడ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

English summary
vigillance sp caught taking bribe from ricemillers in nalgonda town, sp demanded ricemillers for bribe,they approched acb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X