హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్‌లోకి రండి: కెటిఆర్ ఆహ్వానం, కలిసి పనిచేద్దామన్న విజయరామారావు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కెటి రామారావు శనివారం భేటీ అయ్యారు. టిఆర్ఎస్‌తో కలిసి పనిచేయాలని ఆహ్వానించేందుకే ఆయన ఇంటికి వచ్చానని కెటిఆర్‌ తెలిపారు.

టిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్‌ కార్యకలాపాలపై విజయరామారావుకు సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు. ఒకప్పుడు విద్యాధికులు ఓట్లే వేయరనే భావనను తిరగరాసిన ఘనత కచ్చితంగా విజయరామారావుదేనని అన్నారు.

ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ.. తెలంగాణలో వెనకబడిన ప్రాజెక్టుల్ని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో కెసిఆర్‌కు అంకితభావం ఉందన్నారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసతో కలిసి పని చేస్తానని చెప్పారు.

విజయరామారావు టిడిపికి శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల తరువాత కెసిఆర్‌ను కలువనున్నట్టు విజయరామారావు తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం అక్రమం అని విపక్షాలు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు ఉంటుందని కెటిఆర్ తెలిపారు.

విజయరామారావు

విజయరామారావు

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారు.

విజయారెడ్డి ఆహ్వానం

విజయారెడ్డి ఆహ్వానం

శనివారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కెటి రామారావు శనివారం భేటీ అయ్యారు. టిఆర్ఎస్‌తో కలిసి పనిచేయాలని ఆహ్వానించేందుకే ఆయన ఇంటికి వచ్చానని కెటిఆర్‌ తెలిపారు.

విజయరామారావుతో కెటిఆర్

విజయరామారావుతో కెటిఆర్

టిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్‌ కార్యకలాపాలపై విజయరామారావుకు సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు.

విజయరామారావుతో కెటిఆర్

విజయరామారావుతో కెటిఆర్

ఒకప్పుడు విద్యాధికులు ఓట్లే వేయరనే భావనను తిరగరాసిన ఘనత కచ్చితంగా విజయరామారావుదేనని అన్నారు.

విజయరామారావుతో కెటిఆర్

విజయరామారావుతో కెటిఆర్

ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ.. తెలంగాణలో వెనకబడిన ప్రాజెక్టుల్ని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో కెసిఆర్‌కు అంకితభావం ఉందన్నారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసతో కలిసి పని చేస్తానని చెప్పారు.

విజయరామారావుతో కెటిఆర్

విజయరామారావుతో కెటిఆర్

విజయరామారావు టిడిపికి శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వియజయరామారావు నివాసం

వియజయరామారావు నివాసం

మరో రెండు రోజుల తరువాత కెసిఆర్‌ను కలువనున్నట్టు విజయరామారావు తెలిపారు.

విజయరామారావుతో కెటిఆర్

విజయరామారావుతో కెటిఆర్

టిఆర్‌ఎస్ పార్టీ ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం అక్రమం అని విపక్షాలు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు ఉంటుందని కెటిఆర్ తెలిపారు.

విజయరామారావుతో కెటిఆర్

విజయరామారావుతో కెటిఆర్

ఇప్పుడు విమర్శిస్తున్న జానారెడ్డి పార్టీ మారలేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. టిడిపి నుంచి జానారెడ్డి కాంగ్రెస్‌లో చేరారని, చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన వారే కదా? అని అన్నారు.

విజయరామారావు

విజయరామారావు

జానారెడ్డి, చంద్రబాబు పార్టీలు మారవచ్చు కానీ వారి పార్టీల ఎంపిటీసిలు, జెడ్‌పిటీసిలు పార్టీలు మారకూడదా? అని ప్రశ్నించారు. ఒక్క టిఆర్‌ఎస్‌లోకే వలసలు వస్తున్నట్టు, టిఆర్‌ఎస్ ఏదో తప్పు చేస్తున్నట్టు విపక్షాలు మాట్లాడడం సరికాదని అన్నారు.

English summary
It said that Vijaya Rama Rao likely join in Telangana Rashtra Samithi Party in soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X