వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ దొరగారూ.. ఇకనైనా మేలుకొండి: కడిగిపారేసిన విజయశాంతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. తాజా, పరిణామాలే ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా ఆమె స్పందించారు.

'తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనం. చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనానికి వరంగల్ కూడా బలైంది' అని విజయశాంతి మండిపడ్డారు.

vijayashanthi hits out at telangana cm kcr

'ఇక భూకబ్జాలను ఆపలేక రెవెన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం ఘటనే చెబుతోంది. తెలంగాణలో అత్యంత ప్రధానమైనదీ... కోవిడ్ చికిత్సా కేంద్రంగానూ ఉన్న గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా అక్కడ ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నీరుగారి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది' అని విజయశాంతి విమర్శించారు.

'ఇక కోవిడ్ చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వాసుపత్రులు, ఇటు ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టికాయల గాయాలే సాక్ష్యం. ప్రభుత్వ తీరుపై వైద్యులు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీసం స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ దొరగారి పరిపాలనా వైఫల్యంపై పెద్ద గ్రంథమే రాయవచ్చు. ఇకనైనా మేలుకోండి.. పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దండి' అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి వ్యాఖ్యానించారు.

English summary
Congress leader vijayashanthi hits out at telangana cm kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X