వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తన కాళ్లు మొక్కి కేసీఆర్ చెప్పిన మాటలు విని సోనియా ఆశ్చర్యపోయారు: విజయశాంతి షాకింగ్

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి/ఖమ్మం: ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తెరాస పైన నిప్పులు చెరిగారు. నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణ ప్రజలను తెరాస పూర్తిగా మోసం చేసిందన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెబుతున్న కల్లిబొల్లి మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!

 సోనియా గాంధీ పట్ల నీచంగా మాట్లాడారు

సోనియా గాంధీ పట్ల నీచంగా మాట్లాడారు

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ బిడ్డలను చూసేందుకు వస్తే కేసీఆర్ మాత్రం నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇది ఆయన స్థాయికి తగనిది అన్నారు. రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం వస్తే అన్ని విధాలా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

పేదలకు గ్యాస్ సిలిండర్ ఉచితం

పేదలకు గ్యాస్ సిలిండర్ ఉచితం

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు కూటమి గెలుపుతో ఏర్పడే ప్రభుత్వం ఇస్తుందని విజయశాంతి చెప్పారు. పేదలకు తొమ్మిది రకాల నిత్యావసర సరకులతో పాటు ఏడాదికి ఆరు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మహేందర్ రెడ్డి మంత్రి అయ్యారని విమర్శించారు.

 సోనియా కాళ్లమీద పడి అలా అడిగారు

సోనియా కాళ్లమీద పడి అలా అడిగారు

దొరా.. కేసీఆర్.. ఇదేంది అన్నా.. తెలంగాణ వస్తే ఏమో చేస్తావని అనుకున్నామని, కానీ ఏమీ చేయలేదని విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఏదో చేస్తాడనుకుంటే నమ్మిన ప్రజలను మోసం చేశారని చెప్పారు. దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పావా లేదా అన్నా.. అని నిలదీశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబ సభ్యులంతా పడి అమ్మా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని కేసీఆర్ అడిగారని ఆరోపించారు.

కేసీఆర్ చెప్పిన మాటలు విని సోనియా ఆశ్చర్యపోయారు

కేసీఆర్ చెప్పిన మాటలు విని సోనియా ఆశ్చర్యపోయారు

ప్రజలకు దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి, సోనియా గాంధీ వద్ద లోపలకు వెళ్లి తననే చేయమని అడగడంతో సోనియా ఆశ్చర్యపోయారని, దీంతో దళితబిడ్డనే సీఎంగా చేయాలని, నేను మిమ్మల్ని చేయనని చెప్పారని, ఇలా మాట తప్పినప్పుడు నీవు నా పార్టీలో చేరవద్దని ఆమె పంపించేశారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అన్నారు. ఆమెను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్, కవితలకు లేదని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

English summary
Congress party leader Vijayashanthi says why was KCR not merged TRS in Congress? She campainged for the Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly. The incumbent Telangana Rashtra Samithi, the Indian National Congress, Telangana Jana Samithi, and Telugu Desam Party are considered to be the main contestants in the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X