వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2019: కాంగ్రెస్‌లో విజయశాంతి, అజహరుద్దీ‌న్‌కు కీలకపదవులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Vijayashanthi and Azharuddin in Congress Campaign Committee

హైదరాబాద్: 2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమౌతోంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం చర్యలను తీసుకొంటోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలోకి సెలబ్రిటీలను తీసుకొంది. సినీ నటి విజయశాంతి, ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్‌లకు ఈ కమిటీలో చోటు దక్కింది.

2019 ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తోంది. పీసీసీని పునర్వవ్యవస్థీకరించే పనిలో ఎఐసిసి నాయకత్వం ఉంది.ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ జాతీయ నాయకత్వం చర్యలను తీసుకొంటుంది.

నవంబర్ నాటికి కాంగ్రెస్ పార్టీలోని అన్ని రకాల కమిటీలను పూర్తిచేయాలని పార్టీ నిర్ణయం తీసుకొంది. పిసీసీ అధ్యక్షుడికి తోడుగా మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశం ఉంది.

2019 ఎన్నికల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల తర్వాత పార్టీ అన్ని కమిటీలను పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.

కాంగ్రెస్ ప్రచార కమిటీలో విజయశాంతి, అజహరుద్దీన్‌కు చోటు

కాంగ్రెస్ ప్రచార కమిటీలో విజయశాంతి, అజహరుద్దీన్‌కు చోటు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో విజయశాంతికి చోటు దక్కింది. విజయశాంతితో పాటు ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్‌కు కూడ చోటును కల్పించారు.టిఆర్ఎస్ లో విజయశాంతి కీలకంగా పనిచేశారు. అయితే ఆమె టిఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్‌లో చేరి 2014లో మెదక్ నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు.ఆనాటి నుండి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ తెలంగాణ రాష్ట్రం నుండి తన రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకోనున్నారు. గతంలో ఆయన యూపీ రాష్ట్రం నుండి రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించారు. వీరిద్దరికి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో చోటు దక్కింది.

రాజకీయాల్లో చురుకుగా విజయశాంతి

రాజకీయాల్లో చురుకుగా విజయశాంతి

గత ఎన్నికల సమయంలో ఓటమి పాలైన తర్వాత విజయశాంతి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె నేతలతో తరచూ సమావేశమయ్యారు. అయితే తమిళ రాజకీయాల్లో విజయశాంతి ప్రవేశిస్తారనే ప్రచారం కూడ సాగింది.కానీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో విజయశాంతికి స్థానం దక్కడంతో విజయశాంతి క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

స్వంత రాష్ట్రం నుండి అజహరుద్దీన్ రాజకీయ రంగ ప్రవేశం

స్వంత రాష్ట్రం నుండి అజహరుద్దీన్ రాజకీయ రంగ ప్రవేశం

ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ తన రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకొనే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో అజారుద్దీన్ చేరారు. యూపీలోని మొర్దాబాద్ నియోజకవర్గం నుండి ఆయన ఎంపీగా విజయం సాధించారు. అయితే యూపీలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయితే యూపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ తరుణంలో స్వంత రాష్ట్రం నుండి రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకొనే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు

ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు


టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019 ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే మరో ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. ఆయనతో పాటు మరో వ్యక్తికి కూడ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం ఉంది. నవంబర్ నాటికి కాంగ్రెస్ పార్టీలోని అన్ని స్థాయిల్లో పదవులను భర్తీ చేయనున్నారు.

English summary
vijayashanti and Azharuddin in Tpcc campaign committee. Aicc announced Tpcc campaign committee.Congress party planning for 2019 elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X