వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సర్కార్‌పై కేంద్రం నిఘా : తాటతీస్తారన్న ఫైర్ బ్రాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు ఫైర్ బ్రాండ్ విజయశాంతి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్ సర్కార్‌పై కేంద్రం నిఘా వేయడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల నోరునొక్కిన కేసీఆర్ .. కేంద్రానికి మాత్రం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షమే లేకుండా చేయడం మంచిది కాదని, సీఎల్పీ విలీనం గురించి ప్రస్తావించి .. విమర్శించారు.

vijayashanti fire in kcr

తెలంగాణ రాష్ట్రంలో అక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఆధారాలతో సహా చూపించిన నియంతృత్వ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. అంతేకాదు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని బెదిరించారని గుర్తుచేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రం నిశీతంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఇక్కడ జరిగే అంశాలపై నిఘా పెట్టిందన్నారు. రాష్ట్రంలో జరిగే అవకతవకలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుందని ఇటీవల బీజేపీ నేతల వ్యాఖ్యలను ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచకాలు పీక్ స్టేజీకి చేరాయని గుర్తుచేశారు. తాము ఏం చేసినా చెల్లుతుందని ఆ పార్టీ భావిస్తూ .. వచ్చిందన్నారు. దీంతో రాష్ట్రంలో జరిగే వ్యవహారంపై నిఘా పెట్టడమే కాకుంగా .. అవకతవకలపై ఫోకస్ చేయడం మంచి పరిణామన్నారు. వీటిపై సరైన చర్యలు తీసుకుంటే తెలంగాణ ప్రజలు హర్షిస్తారని తెలపారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆడుతున్న నాటకాలు తొలగిపోయి .. నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్నారు.

English summary
The Center welcomed the surveillance of KCR Sarkar who was misusing public funds. Opposition mouths in the state of KCR .. The center should answer only. It is not good to do without opposition in a democracy, vijayashanti said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X