వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ నాకంటే గొప్ప నటుడు ..వాళ్ళ శవాల మీద కూర్చుని పాలన చేస్తున్నాడు :విజయశాంతి ధ్వజం

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి తన జీవితాన్ని నెమరువేసుకున్నారు సినీ నటి విజయశాంతి. సినిమాల్లో సక్సెస్ సాధించినా, రాజకీయాలలో పెద్దగా రాణించలేక పోయిన విజయశాంతి తెలంగాణ ఉద్యమం గురించి, సీఎం కేసీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తనకంటే గొప్ప నటుడు కెసిఆర్ అంటూ విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ పెద్ద డ్రామా చేశాడంటూ ఆసక్తికర అంశాలు బయటపెట్టారు.

రంగుల లోకం నుండి రాజకీయాల్లో.. విజయశాంతి సక్సెస్ అయ్యారా ? బీజేపీలో అయినా క్రియాశీలకంగా మారతారా ?రంగుల లోకం నుండి రాజకీయాల్లో.. విజయశాంతి సక్సెస్ అయ్యారా ? బీజేపీలో అయినా క్రియాశీలకంగా మారతారా ?

 తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి ఇంతకాలం కేసీఆర్ ని భరించారు

తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి ఇంతకాలం కేసీఆర్ ని భరించారు

తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి ఇంతకాలం కేసీఆర్ ని భరించారని విజయశాంతి స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రజలు భరించే స్థితిలో లేరని, తెలంగాణ రాష్ట్రం కోసం కరెక్ట్ పార్టీ వచ్చిందంటూ బిజెపి ని ఉద్దేశించి మాట్లాడారు. టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని పేర్కొన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో పదవులు పంచాయితీ ఇప్పటికీ నడుస్తూనే ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిదానికి డబ్బులు డబ్బులు డబ్బులు ఏం చేసుకుంటావు దొరా .. నెత్తిమీద కొట్టుకుంటావా అంటూ కేసీఆర్ ని ప్రశ్నించిన విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరణించిన వారి సేవల మీద కూర్చుని పాలన చేస్తున్నావని మండిపడ్డారు .

 ఆ రోజు లక్ష లేని వ్యక్తికి ఈరోజు లక్ష కోట్లు ఎలా వచ్చాయో

ఆ రోజు లక్ష లేని వ్యక్తికి ఈరోజు లక్ష కోట్లు ఎలా వచ్చాయో

తనను పదో చెల్లి అని చెప్పాడని, రాఖీ పౌర్ణమి కి తన దగ్గరికి వస్తాను అన్నాడు అని, లేట్ అయితే సంతోష్ కి ఫోన్ చేస్తే మీకు ఇవ్వడానికి పది వేల రూపాయల కోసం ఆగాడు అని చెప్పాడని గుర్తు చేశారు విజయశాంతి. ఆ రోజు లక్ష లేని వ్యక్తికి ఈరోజు లక్ష కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని విజయశాంతి కేసీఆర్ ను ప్రశ్నించారు.
తెలంగాణా ఉద్యమ సమయంలో కేసీఆర్ స్వార్ధం కోసం తన పార్టీని విలీనం చేసేలా ఒత్తిడి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడును తింటున్నాడు అని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు అమరవీరుల సేవలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నాడని టిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని ఆమె పేర్కొన్నారు . టిఆర్ఎస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మడం లేదని, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు.

 తెలంగాణా ఉద్యమంలో ముందు నుండి ఉంది తానే అన్న విజయశాంతి

తెలంగాణా ఉద్యమంలో ముందు నుండి ఉంది తానే అన్న విజయశాంతి

జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. కానీ ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు చివరివరకూ పోరాడాలి సాధించాలి. అందుకే నేను 1998 రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి, తెలంగాణ ఇష్యూ ని తీసుకుని పోరాటం సాగించానని , నేటికీ తనకు తెలంగాణానే ప్రాధాన్యత అని విజయశాంతి పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ లేరని, తాను బిజెపి లో ఉండి పోరాటం చేశానని చెప్పిన విజయశాంతి, టిడిపి, బిజెపి కలసి పని చేస్తున్న క్రమంలో, తెలంగాణను వ్యతిరేకించిన టిడిపి తీరు నచ్చక తప్పనిసరి పరిస్థితుల్లో నాడు బిజెపికి రాజీనామా చేశారంటూ చెప్పుకొచ్చారు.

 నా కుటుంబం రారని చెప్పిన కేసీఆర్ , ఇప్పుడేం చేశారో చూశారా ?

నా కుటుంబం రారని చెప్పిన కేసీఆర్ , ఇప్పుడేం చేశారో చూశారా ?

ఉద్యమం కోసమే బిజెపిని వదిలేశానని , ఆ సమయంలో తీవ్ర ఆవేదనకు గురయ్యానని రాములమ్మ నాటి తన బాధను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని, ఆ తరువాత ఎంటరైన దొరగారు, కేవలం మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో తెలంగాణ ప్రజల నాడిని తెలుసుకొని ఉద్యమంలోకి వచ్చాడని చెప్పారు. నాడు ఉద్యమ సమయంలో నేను నా ముసల్ది మాత్రమే ఉన్నాం. నా కుటుంబం ఎవరూ రారు అని పేర్కొన్న కేసీఆర్ నేడు ఏం చేసాడో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు విజయశాంతి.

 తెలంగాణా పేరు చెప్పి తనను , తన పార్టీని కలుపుకున్న కేసీఆర్

తెలంగాణా పేరు చెప్పి తనను , తన పార్టీని కలుపుకున్న కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను దూకుడుగా ముందుకు వెళుతుంటే, దురుద్దేశంతోనే కేసీఆర్ నన్ను తమ పార్టీలో కలుపుకోవాలని చూశాడని విజయశాంతి పేర్కొన్నారు. తనను ఆహ్వానించడానికి నరేంద్రను దాదాపు 25 సార్లు పంపించి ఉంటాడని గుర్తు చేసుకున్నారు. ఉద్యమం కోసం విడివిడిగా పని చేయడం ఎందుకు కలిసి పని చేద్దాం అంటే తెలంగాణ కోసం కలిసి నడిచానని పేర్కొన్న విజయశాంతి, పార్టీని విలీనం చేసే దాకా తనపై కెసిఆర్ ఒత్తిడి తీసుకొచ్చారని, ద్రోహిగా ముద్ర వేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.

పార్లమెంట్ లో తెలంగాణా బిల్ సమయంలో ఉన్నది నేనే

పార్లమెంట్ లో తెలంగాణా బిల్ సమయంలో ఉన్నది నేనే

తాను బీజేపీలో ఉన్న సమయంలోనే సోనియాగాంధీ మీద పోటీ చేయాలని కేసీఆర్ సూచించారన్నారు. ఇక తాను ఎంపీగా గెలిచిన అప్పటినుంచి తనను లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేశాడని, వైయస్ ని కలిసిన సందర్భంలో కూడా తాను కెసిఆర్ కి చెప్పే కలిశానని, అయినప్పటికీ కాంగ్రెస్లో చేరుతున్నారని దుష్ప్రచారం చేయించి, ఉస్మానియా యూనివర్సిటీ లో తనను నానా మాటలు అనిపించారు అని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేసిన విజయశాంతి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఉంది తానే అన్నారు. కెసిఆర్ ఆ రోజు కూడా లేడని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని సోనియా గాంధీని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని విజయశాంతి పేర్కొన్నారు.

English summary
Movie actress Vijayashanti has been remembering her life since she came into politics. Despite her success in movies, Vijayashanti, who could not excel in politics, revealed interesting things about the Telangana movement and CM KCR. Interesting facts have been revealed that KCR has done a big drama during the Telangana movement Vijayashanti saying that KCR is a better actor than me .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X