
రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తే ఆ మట్టితోనే కేసీఆర్ ప్రభుత్వానికి బొంద పెడతారు: విజయశాంతి
తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ తీరును ఎండగడుతున్న విజయశాంతి తాజాగా రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్న టిఆర్ఎస్ తీరుపై విరుచుకుపడ్డారు.
కేసీఆర్ వడ్ల నాటకం వెనుక పీకే సర్వే.. బీజేపీ అంటే భయం అందుకే: ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్ కొత్త నాటకం షురూ చేశారు
సీఎం కేసీఆర్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో ధర్నాలు వద్దన్న సీఎం... ఇప్పుడు స్వయంగా ధర్నాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త నాటకం షురూ చేశారని, తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ నేతగా గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారి పోయాడు అని విజయశాంతి పేర్కొన్నారు .

రాజకీయ పబ్బం గడుపుకోవాలని కెసిఆర్ ఆలోచన
రాష్ట్ర రైతాంగాన్ని సీఎం కెసిఆర్ మోసం చేస్తున్నాడు మండిపడిన విజయశాంతి కేంద్రం మీద నిందలు వేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని కెసిఆర్ ఆలోచిస్తున్నాడు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో అన్ని అనర్థాలకు కారణం ముఖ్యమంత్రి అతివిశ్వాసం అని పేర్కొన్న విజయశాంతి, కేసిఆర్ అబద్ధాల పుట్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటల్ని ఎవరూ నమ్మరని పేర్కొన్న విజయశాంతి, ప్రజలను మోసం చేయడం కోసం రోజుకో కొత్త నాటకమాడే కేసీఆర్ తాజాగా వడ్ల నాటకం మొదలు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని పీకే సర్వేలో తేలింది
కేంద్ర ప్రభుత్వం మీద కావాలనే కెసిఆర్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుందన్న విజయశాంతి కేంద్రం ఎక్కడ వడ్లు కొనేది లేదని చెప్పలేదని పేర్కొన్నారు. కావాలని కేంద్రంపై దుష్ప్రచారం చేయడం కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విజయశాంతి పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని పీకే సర్వేలో తెలియడంతోనే తెలంగాణ రాష్ట్రంలోనూ పంజాబ్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. బిజెపి గొంతు నొక్కాలని కెసిఆర్ చూస్తున్నారని పేర్కొన్న విజయశాంతి, ఇప్పటికే కేసీఆర్ పై తీవ్ర అసహనంతో ఉన్న ప్రజలు చూస్తూ ఊరుకోరని తేల్చి చెప్పారు.

