• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లాక్ డౌన్ సమయంలో విజయశాంతి చాలా గొప్ప పని చేశారుగా !! ఆమె ఏం చేశారంటే

|

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇక లాక్ డౌన్ దెబ్బకి ఎవరికి వారు వారి ఇంట్లోనే సమయాన్ని గడిపేస్తున్నారు. ఇక ప్రముఖులు,సినీ స్టార్స్ అందరూ లాక్ డౌన్ సమయంలో తాము ఇళ్ళల్లో ఏం కాలక్షేపం చేస్తుంది ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలిసేలా చేస్తున్నారు. ప్రతి వ్యక్తి ఇళ్లకే పరిమితం అయి సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్తున్న సమయంలో ఆసక్తికరమైన విషయాలను చెప్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వారి ఆసక్తులను బయటపెడుతున్నారు.

లాక్ డౌన్ లోనూ స్కూలు ఫీజులు ... లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇచ్చిన పేరెంట్

 లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తున్నారో చెప్పిన విజయశాంతి

లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తున్నారో చెప్పిన విజయశాంతి

లాక్ డౌన్ సమయంలో ఒక్కొక్కరు ఒక స్థాయిలో వారు చేస్తున్న పనులని ఆన్లైన్ లోకి వచ్చి వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ లాక్ డౌన్ సమయం ను ఎలా గడుపుతున్నారు తెలిపేందుకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇక విజయశాంతి తాను చేసిన పోస్ట్ లో పాత కాలం నాటి సినీ మహనీయుల చిత్రాలను చూస్తూ వారిని గుర్తు చేసుకుంటున్నట్టు తెలిపారు.

 లాక్ డౌన్ లో అలనాటి నటీనటుల సినిమాలు మరోసారి చూస్తున్నానన్న విజయశాంతి

లాక్ డౌన్ లో అలనాటి నటీనటుల సినిమాలు మరోసారి చూస్తున్నానన్న విజయశాంతి

కొంత విరామంతో కొనసాగుతున్న ఈ ప్రస్తుత లాక్‌డౌన్ పరిణామం నాలో కలిగించిన ఒక ఉద్వేగభరిత భావంతో మన తెలుగు నటీమణుల, నటప్రవీణుల విద్వత్తు, ప్రతిభల సమున్నతను స్మరిస్తున్న సందర్భం ఇది. అత్యున్నత స్థాయికి చెందిన మన తెలుగు చిత్రాలను ఇంతకుముందు ఎన్నో పర్యాయాలు చూసినప్పటికీ ఇప్పుడు మరోసారి చూసే అవకాశం లభించింది అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక భానుమతిగారితో ఆరంభమై కన్నాంబ, అంజలీదేవి, సావిత్రి, జమున, సరోజాదేవి, ఎల్ విజయలక్ష్మి, కృష్ణకుమారి, సూర్యకాంతం, నిర్మలమ్మ, శారద, వాణిశ్రీ, రమాప్రభ, జయసుధ, జయప్రద, శ్రీదేవి గార్ల వంటి అందరూ నటించిన సినిమాలు చూస్తున్నానని, వారి నటన మరో మారు చూస్తూ వారి గొప్పతనాన్ని మననం చేసుకుంటున్నానని చెప్పారు.

  China's Economy Shrinks For The First Time Ever
  వరాల నటనా విశారదుల సినిమాలపై ఉద్వేగంగా విజయశాంతి ట్వీట్

  వరాల నటనా విశారదుల సినిమాలపై ఉద్వేగంగా విజయశాంతి ట్వీట్

  ఎస్వీ రంగారావుగారి నుండి రేలంగి, రమణారెడ్డి, అల్లురామలింగయ్య, ధూళిపాళ, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం, రాజబాబు, సత్యనారాయణ, రావుగోపాలరావు, కోట గార్ల వరకూ ఇంకెందరో, ఎందరో, మన తెలుగు సినిమాను ప్రేక్షకుల కన్నులపంటగా తీర్చిదిద్దిన వరాల నటనా విశారదులు అంటూ సినీ పరిశ్రమలోని అలనాటి నటీనటుల గురించి చాలా ఉద్వేగంగా ట్వీట్ చేశారు విజయశాంతి . తెలుగు సినిమా ప్రారంభం నుండి, నేటి వరకూ ప్రజాభిమానం పొందిన హీరో పాత్రధారులు, స్టార్లు, సూపర్‌స్టార్లందరికీ సముచిత గౌరవాన్ని ఇస్తూ, పైన చెప్పిన వారందరినీ ఒకసారి, మరొక్కసారి గుర్తు చేసుకోగలిగిన జీవనగమన సంప్రాప్తత ఈ సమయం అని అభిప్రాయపడుతున్నాను. అనిట్విట్టర్ లో పోస్ట్ చేశారు విజయశాంతి .

  English summary
  During the lockdown, people are sharing videos and photos of what they are doing at one level. Meanwhile, Lady Superstar VijayaShanti posted a post on social media to show how the lockdown time is going. Vijayashanti said in his post that he remembers looking at old cinematic films.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X