విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమానంలో.. బెజవాడ పోకిరీ కార్పోరేటర్‌కు శంషాబాద్ పోలీస్ నోటీసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విజయవాడ పోకిరీ కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర రావుకు శంషాబాద్ పోలీసులు బుధవారం నాడు నోటీసులు ఇచ్చారు. విజయవాడ వెళ్లి ఆయనకు నోటీసులు అందించారు. తమ ఎదుట వారం రోజుల్లో హాజరు కావాలని, లేదంటే చర్యలు తప్పవని అందులో పేర్కొన్నారు.

విమానంలో ఓ మహిళను వేధించిన కేసును కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర రావు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శంషాబాద్ పోలీసులు ఆయనకు ఈ రోజు నోటీసులు అందించారు. గడువులోగా హాజరు కాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా, విమానంలో మహిళా ఫ్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు శంషాబాద్ డీసీపీ నాలుగు రోజుల క్రితం తెలిపారు. ఈ కేసులో ఆయన వివరణ కోరేందుకు ఇప్పటికే రెండు బృందాలను ఏపీకి పంపినట్లు ఆయన తెలిపారు.

Vijayawada corporator faces case for harassing woman

ఆ రెండు బృందాలు కూడా కార్పోరేటర్ చంటిబాబును హైదరాబాద్‌కు తీసుకొస్తాయని చెప్పారు. కార్పోరేటర్ చంటిబాబుపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్ అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించడం వల్లే అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

ఎయిరిండియా విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను విజయవాడ 25 డివిజన్ టీడీపీ కార్పొరేటర్ చంటిబాబుపై శంషాబాద్ విమానాశ్రయంలోని ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదయింది.

సీఐ సుధాకర్ కథనం ప్రకారం... హైదరాబాద్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ-544 విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరారు.

హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఈ విమానంలోనే ఆమె పక్కసీట్లోనే కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు కూర్చున్నాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోపు మహిళా ప్రొఫెసర్‌ను తన కాలివేళ్లతో పదేపదే తాకడంతోపాటు ఆమెపై చేతులు చేసి అసభ్యంగా ప్రవర్తించాడు.

English summary
Vijayawada corporator faces case for harassing woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X