వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విక్రమ్‌గౌడ్ కాల్పుల కేసు: పోలీసుల చేతికి ఫోరెన్సిక్ నివేదిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందింది. ఘటనా స్థలంలో దొరికిన రెండు తూటాలు ఒకే తుపాకీ నుండి వచ్చాయని తేలింది.గత ఏడాది ఫిలింనగర్‌లో ఉంటున్న విక్రమ్‌గౌడ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

విక్రమ్‌ గౌడ్ కాల్పుల ఘటనను సానుభూతి కోసమే బాధితుడే చేయించాడని పోలీసులు ప్రకటించారు. అయితే దీన్ని విక్రమ్ గౌడ్ ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం తన మనుషులతోనే ఈ డ్రామాకు తెరతీశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విక్రమ్‌ను అరెస్ట్ చేశారు.

 Vikram goud:Forensic Report submitted to Police

ఘటనా స్థలంలో దొరికిన తూటాను, విక్రమ్ శరీరంలో లభించిన మరో తూటాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. గురువారం ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు పోలీసులకు అందింది.

Recommended Video

Congress Leader Mukesh Goud's Son Vikram Goud Shot at Banjara Hills

రెండు తూటాలు ఒకే తుపాకి నుంచి వచ్చినవి నివేదికలో తేలడంతో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు.పోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

English summary
forensic report has been submitted to police on Vikram goud firing case on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X