హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.30 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో: తండ్రితో విభేదాలపై విక్రమ్ గౌడ్

నన్ను నేను కాల్చుకునే దౌర్భాగ్యం లేదని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆదివారం ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. విక్రమ్ గౌడ్ బెయిల్‌పై శనివారం విడుదలయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నన్ను నేను కాల్చుకునే దౌర్భాగ్యం లేదని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆదివారం ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. విక్రమ్ గౌడ్ బెయిల్‌పై శనివారం విడుదలయ్యారు.

చదవండి: నన్ను త్వరగా కాల్చండి, రాజకీయం కోసమే, విక్రమ్ పక్కా ప్లాన్‌తో

తనకు రూ.30 కోట్ల అప్పులు ఉన్నాయనేది అవాస్తవం అన్నారు. రూ.30 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదన్నారు. రాజకీయాల కోసం తాను కాల్చుకున్నాననే వాదనలు సరికాదన్నారు.

నేనే పోలీసులకు చెప్పా

నేనే పోలీసులకు చెప్పా

అప్పుల్లో ఉన్న తాను రూ.50 లక్షలు ఇచ్చి ఎలా కాల్పించుకుంటానని విక్రమ్ గౌడ్ ప్రశ్నించారు. నందు అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు నేనే చెప్పానని తెలిపారు. కాల్పుల కేసును కోర్టులోనే ఎదుర్కొంటానని చెప్పారు. డ్రగ్స్ కేసుతోను తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

సానుభూతి కోసం అన్నది అవాస్తవం

సానుభూతి కోసం అన్నది అవాస్తవం

తాను సానుభూతి కోసమే కాల్పులు జరిపించుకున్నాననే ఆరోపణలు సరికాదని విక్రమ్ గౌడ్ అన్నారు. ఓ వ్యక్తి బుల్లెట్ కాల్చుకోగలుగుతాడేమో కానీ రెండో బుల్లెట్ ఎలా కాల్చుకుంటాడని ప్రశ్నించారు.

విచారణలో ఇన్ని..

విచారణలో ఇన్ని..

ప్రాథమిక విచారణలో తనను తాను కాల్చుకున్నానని మొదట చెప్పారని, ఆ తర్వాత నా భార్య కాల్చిందని చెప్పారని, మరోసారి విచారణలో ఎవరో వచ్చి కాల్చిన ఆధారాలు లేవని చెబుతున్నారని, మరి ఆ తర్వాత వారికి ఎవరో వచ్చి కాల్చిన ఆధారాలు ఎలా దొరికాయని ప్రశ్నించారు.

మా నాన్న రాజకీయాల్లోనే ఉన్నారు, రిటైర్ కాలేదు

మా నాన్న రాజకీయాల్లోనే ఉన్నారు, రిటైర్ కాలేదు

తన తండ్రి ముఖేష్ గౌడ్ ఇంకా రాజకీయాల్లో నుంచి రిటైర్ కాలేదని, అలాంటప్పుడు తాను రాజకీయ సానుభూతి కోసం ఎందుకు ప్రయత్నిస్తానని విక్రమ్ గౌడ్ అడిగారు. తాను ఇటీవల కార్పోరేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తే, ప్రజలు తనకు చెప్పాల్సిన సమాధానం చెప్పారన్నారు.

తండ్రితో విభేదాలపై

తండ్రితో విభేదాలపై

తన తండ్రి ముఖేష్ గౌడ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని విక్రమ్ గౌడ్ చెప్పారు. కొడుకు ఎంత చెడ్డవాడైనా తండ్రితో గ్యాప్ రాదన్నారు. తనకు, తన తండ్రికి మధ్య గ్యాప్ వచ్చిందనే విషయం విని ఆశ్చర్యపోయానని చెప్పారు. తాను ఏడిస్తే తన తండ్రి ఏమైనా చేస్తారన్నారు.

English summary
Former Minister Mukesh Goud's son Vikram Goud responded on firing and differences with father on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X