హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పూరీ జగన్నాథ్ అందుకే వచ్చారు: డ్రగ్స్ ఆరోపణలపై విక్రమ్ సవాల్

ఆస్పత్రిలో తనను సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలవడంపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ సోమవారం వివరణ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆస్పత్రిలో తనను సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలవడంపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ సోమవారం వివరణ ఇచ్చారు. పూరీ జగన్నాథ్ తనకు చాలా సన్నిహితుడని, అందుకే ఆస్పత్రిలో ఉన్న తనను చూసేందుకు వచ్చారని చెప్పారు.

'బుల్లెట్లా ఎలా ఉంటాయ్, తుపాకీ చూడనే లేదు': విచారణలో విక్రమ్ తిక్క సమాధానాలు'బుల్లెట్లా ఎలా ఉంటాయ్, తుపాకీ చూడనే లేదు': విచారణలో విక్రమ్ తిక్క సమాధానాలు

సందేహాలు అక్కర్లేదు..

సందేహాలు అక్కర్లేదు..

అంతేగాక, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు. విక్రమ్ గౌడ్ ఇటీవల కాల్పుల ఘటన కేసులో గాయాలతో ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం విక్రమ్ గౌడ్‌ని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్ పై విడుదలయ్యారు. చికిత్స తీసుకుంటుండగా పూరీ.. విక్రమ్ ను కలిసిన విషయం తెలిసిందే.

Recommended Video

Puri Jagannadh Wife Sensational Comments on Charmi Puri Relation
డ్రగ్స్ ఆరోపణలపై సవాల్..

డ్రగ్స్ ఆరోపణలపై సవాల్..

డ్రగ్స్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని, పూరీ జగన్నాథ్ తనను కలవడాన్ని.. దీంతో ముడిపెట్టి చూడరాదన్నారు. కావాలంటే తన నుంచి నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుకోవచ్చని సవాల్ చేశారు.

పబ్ లేదు.. అక్కడ అన్నమే తింటారు..

పబ్ లేదు.. అక్కడ అన్నమే తింటారు..

తనకు ఎటువంటి పబ్ లేదని విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ ఉండగా, అది మూత పడిందని తెలిపారు. అలాగే నాగార్జున సెంటర్‌లో ఓ రెస్టారెంట్ ఉందని.. అక్కడ అన్నం తినేందుకు వచ్చేవారికి డ్రగ్స్‌తో సంబంధం లేదని చెప్పారు.

వివరణ అందుకే..

వివరణ అందుకే..

రాష్ట్రంలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో పూరీని సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరీ.. విక్రమ్ గౌడ్‌ను పరామర్శించడం పలు అనుమానాలకు తావిచ్చింది. కాగా, ఈ క్రమంలోనే విక్రమ్ గౌడ్ తన వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Former minister Mukesh Goud's son Vikram Goud responded on Cine Director Puri Jagannath meeting issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X