• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భార్య షిఫాలి ఫిర్యాదుతోనే విక్రమ్ గౌడ్ అబద్దం తెలిసింది: కోర్టుకు తరలింపు

|

హైదరాబాద్: కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఆసుపత్రి నుంచి అతను డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి వీల్ చైర్‌లో వ్యాన్‌లో కోర్టుకు తరలించారు.

నన్ను త్వరగా కాల్చండి, రాజకీయం కోసమే, విక్రమ్ పక్కా ప్లాన్‌తో: పోలీసులు చెప్పిన వివరాలివీ

కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ ప్రథమ ముద్దాయిగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అతను భార్య షిఫాలికి కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. విక్రమ్ ఎపిసోడ్ సినిమా కథను మించిపోయింది. నిందితులు తనను కాల్చేందుకు భయపడ్డా విక్రమ్ దగ్గరుండి ప్రోత్సహించాడు.

గోషామహల్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు

గోషామహల్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు

వచ్చే ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న లక్ష్యంతో కూడా విక్రమ్ గౌడ్‌ ఈ నాటకానికి తెరలేపాడని పోలీసులు బుధవారం తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని, విక్రమ్‌ ఆసుపత్రిలో చెప్పిన అంశాలను విశ్లేషించి, శాస్త్రీయంగా రుజువయ్యాకే కేసులు నమోదు చేశారు.

  Congress Leader Mukesh Goud's Son Vikram Goud Shot at Banjara Hills
  భార్య షిఫాలీ ద్వారా తెలిసిందన్న పోలీసులు

  భార్య షిఫాలీ ద్వారా తెలిసిందన్న పోలీసులు

  విక్రమ్ గౌడ్‌ అబద్ధం చెబుతున్నాడంటూ తమకు ముందుగా ఆయన భార్య షిఫాలి రెడ్డి ఫిర్యాదు ద్వారా తెలిసిందని, ఇందుకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీ లభించడంతో నాటకమంటూ నిర్ధరణ అయిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.5.3 లక్షల నగదు, స్కార్పియో వాహనం, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

  క్యాప్ బోర్డు పేరుతో

  క్యాప్ బోర్డు పేరుతో

  విక్రమ్ గౌడ్‌ గతంలో నిర్మాతగా ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం క్లాప్‌బోర్డ్‌ పేరుతో ఉన్న కార్యాలయంలో కొత్త చిత్రాల రూపకల్పన చేస్తున్నాడు. ఇక్కడ పని చేస్తున్న ప్రొద్దుటూరు వాసి ప్రసాద్‌ తన స్నేహితుడు, పులివెందుల వాసి ఎ గోవిందరెడ్డికి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉందని ఐదు నెలల క్రితం విక్రమ్‌ గౌడ్‌కు చెప్పడంతో, భవిష్యత్‌లో అవకాశాలిస్తానంటూ విక్రమ్‌ హామీ ఇచ్చారు.

  కథ నడిపించాడు

  కథ నడిపించాడు

  కొద్దిరోజుల అనంతరం విక్రమ్ గౌడ్‌ ప్రసాద్‌కు ఇంటికి పిలిపించాడు. తనపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడినట్టు నాటకమాడాలని, ఈ పనిచేస్తే రూ.50 లక్షలు ఇస్తానని, అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. మొత్తం కథను అంతా విక్రమ్ గౌడ్ నడిపించాడని చెప్పారు.

  ముఖేష్ గౌడ్‌

  ముఖేష్ గౌడ్‌

  తండ్రి ముఖేష్ గౌడ్‌ మంత్రిగా ఉన్నప్పుడు యువనేతగా సెటిల్‌మెంట్లు చేసిన విక్రమ్ గౌడ్‌ తన అనుచరులతో పలు దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. బాలానగర్‌, మియాపూర్‌, అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ ఠాణాల్లో కేసులు నమోదైనా వాటి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. చేస్తున్న వ్యాపారాల్లో రూ.కోట్లలో నష్టం రావడం... అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవుతుండటంతో వీటన్నింటినీ అధిగమించి ప్రజానాయకుడిగా ఎదిగేందుకు స్వీయ హత్యాయత్న పథకం రచించాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం విక్రమ్‌కు రూ.50 కోట్ల వరకూ అప్పులున్నాయని అతడి సన్నిహితులు విచారణ అధికారులు వివరించారు. అతను గనుల్లోను పెట్టుబడులు పెట్టాడు. రూ.50 కోట్ల మేర అప్పులున్నాయని తెలుస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Vikram Goud, the son of a former Andhra Pradesh minister, was rushed to Hyderabad's Apollo Hospital with multiple bullet injuries last week. But once the police initiated a probe, Vikram, from victim, turned main suspect.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more