వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీ ఖర్చులకు డబ్బుల్లేవు.. చెక్ పవర్ కూడా లేకపాయే..! సర్పంచ్ భిక్షాటన (వీడియో)

|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ భిక్షాటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవంటూ.. గంభీరావుపేట సర్పంచ్ కటుకం శ్రీధర్ జోల పట్టుకుని భిక్షాటన చేశారు. గ్రామంలోని దుకాణాలు తిరుగుతూ, ప్రజలను కలుస్తూ పరిస్థితి వివరించారు. వారు ఎంతో ఇంతో ఇచ్చింది తీసుకున్నారు.

పంచాయతీ ఎన్నికలు జరిగి 4 నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు కొన్నిచోట్ల సర్పంచులకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదనే ఆరోపణలున్నాయి. దానికి తోడు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కటుకం శ్రీధర్.

పరీక్షల్లో ఫెయిలైతే ఓడినట్లు కాదు.. గుండె తరుక్కుపోతోంది : హరీశ్ రావుపరీక్షల్లో ఫెయిలైతే ఓడినట్లు కాదు.. గుండె తరుక్కుపోతోంది : హరీశ్ రావు

 village sarpanch begging in rajanna sircilla district demanding for cheque power

ప్రభుత్వ పెద్దలు సర్పంచులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చుతున్నారని ఆరోపించారు ఈ యువ సర్పంచ్. అటు అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోతోందని వాపోయారు. సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చే అంశం తమ పరిధిలోనిది కాదంటూ అటు అధికారులు కూడా చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇటు ప్రభుత్వం కనికరించక.. అటు అధికారులు సహకరించక.. గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకోవాలని.. సర్పంచులకు చెక్ పవర్, నిధులు విడుదల చేయాలని కోరారు.

English summary
One of the sarpanch from rajanna sircilla district begging for funds which for village developments. He argued that no cheque power to sarpanches then how to do village development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X