• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు

|

హైదరాబాద్ : గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులమన్నారు టీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత. తాము ఏదీ చేసినా రాష్ట్ర హితం కోసమేనని స్పష్టంచేశారు. ఇదివరకు లానే ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు. శుక్రవారం ఆశేష అభిమానుల సందోహం మధ్య కలెక్టరేట్‌లో ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు కవిత. రెండుసెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

టీ కాంగ్రెస్ నుండి మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్లు ఔట్..! ఎన్నిక‌ల ముందు మ‌రో దెబ్బ‌..!!

గల్లీలో సేవకులం, ఢిల్లీలో సైనికులం

గల్లీలో సేవకులం, ఢిల్లీలో సైనికులం

విభజన అంశాలు, రాష్ట్ర, జిల్లాకు సంబంధించిన అంశాలు, మైనార్టీ, ెస్సీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్‌లో పోరాడామని గుర్తుచేశారు కవిత. 5 ఏళ్లలో చేసిన పనితీరును గుర్తించి హైకమాండ్ మరోసారి టికెట్ ఇచ్చిందని చెప్పారు. తనను మరోసారి గెలిపిస్తే, గులాబీ జెండా రెపరెపలాడుతోందని చెప్పారు. మేం గల్లీలో ప్రజలకు సేవకులం, ఢిల్లీలో సైనికులం అని స్పష్టంచేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వేములు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత పాల్గొన్నారు.

నిధులు, ప్రాజెక్టుల కోసమే ..

నిధులు, ప్రాజెక్టుల కోసమే ..

రాష్ట్రంలోని 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కవిత. మెజార్టీ స్థానాలు గెలిస్తే అభివ‌ృద్ధి పనులు, నిధుల విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. గతంలో టీఆర్ఎస్ ఎంపీల వల్ల రాష్ట్రాభివ‌ృద్ధి కోసం కృషి చేశామని గుర్తుచేశారు. హైకోర్టు విభజనకు ప్రధాన కారణం టీఆర్ఎస్ ఎంపీల కృషేనని స్పష్టంచేశారు. దీంతోపాటు ఇతర అంశాల పట్ల కేంద్రంతో పోరాడి .. సాధించామని, మరోసారి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

గులాబీ రంగు కారులో షికారు

నామినేషన్ వేసేముందు కవిత .. గులాబీరంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్ వచ్చారు. కారును ఎమ్మెల్యే గణేశ్ గుప్తా నడుపగా, మరో ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి వెనుకాల ఆశీనులయ్యారు. అంతకుముందు కవిత ఇంటి వద్ద మహారాష్ట్రకు చెంది డోలు కళాకారులు వాయిద్యాల హోరుతో సందడిగా మారింది.

చేరికల పర్వం

అంతకుముందు నిజామాబాద్ జిల్లా టిడిపి అధ్యక్షుడు బాగారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టిడిపి ఇంచార్జి తారా చంద్ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారి అనుచరులు కూడా గులాబీగూటికి చేరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kavita recalls that partition elements, state and district committees, minority and erstwhile reservation fighting in Parliament. Recognizing the performance done in the last 5 years. We have been told that people in the village of streets were servants and soldiers in Delhi. Kavita has filed a nomination for the nizamabad collectorate among the fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more