వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడెందుకొచ్చారు?: టీఆర్ఎస్ ప్రచార రథంపై గ్రామస్తుల దాడి

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి: ఎన్నికల ప్రచారంలో కొందరు టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తుంటే.. మరికొందరు అభ్యర్థులకు మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి పలు చోట్ల వ్యతిరేకత తప్పడం లేదు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్‌ మండలం గంట్లవెల్లి తండా పరిధిలో టీఆర్ఎస్ ప్రచార రథంపై గ్రామస్థులు దాడిచేశారు.

తండాలో తాగునీటి సమస్య పరిష్కారంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సమస్య పరిష్కారం కోసం వారిని ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదంటూ గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆగ్రహంతో ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు.

జరిగిందేదో జరిగిపోయింది! పద్ధతి మార్చుకో: రాజయ్యపై కడియం, కీలక వ్యాఖ్యలుజరిగిందేదో జరిగిపోయింది! పద్ధతి మార్చుకో: రాజయ్యపై కడియం, కీలక వ్యాఖ్యలు

Villagers attacks on TRS Prachara Ratham at Shadnagar

తండాలోని కొందరు ప్రచార రథాన్ని చుట్టిముట్టి ఫ్లెక్సీలు చింపి గొడవ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో తండాకు వెళ్లిన కొందరు నాయకులు గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామాలకు పార్టీలవారీగా ప్రచార రథాలను తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్రచార రథం గురువారం గంట్లవెల్లి తండాకు చేరుకుంది. ఇటీవల ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా వారి నియోజకవర్గాల్లోనే ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

Recommended Video

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన అమిత్ షా !

English summary
Some Villagers attacked on TRS Prachara Ratham at Ranga Reddy district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X