
Viral Video:4 బర్లు కొన్నా, రోజుకు రూ.1200.. ఓ యువతి వీడియో
తమ సమస్యలకు సంబంధించి వీడియోలు చేసి యూట్యూబులలో వదులుతున్నారు. అయితే తమ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటున్నాయి. అందులో కొలువులు ప్రధాన అంశంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నియామకాల కోసం... అలాంటి ప్రధాన స్లోగన్ను ప్రభుత్వం మరచింది. పేరుకే ఉద్యోగ ప్రకటన చేస్తున్నారే తప్ప.. ఫిలప్ కావడం లేదని నిరుద్యోగులు అంటున్నారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. దీనిని ప్రతిపక్షాలు కూడా చాలాసార్లు ప్రశ్నిస్తున్నాయి. అయినా వారి తీరు మారడం లేదు.

కొలువుల కోసమే..
కొలువు ఇంపార్టెంట్.. ఇక సర్కార్ నౌకరీ అంటే ఆ క్రేజే వేరు.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని.. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. అయినా జాబ్స్ ఆశించిన స్థాయిలో లేవు. దీంతో ఓ యువతి వీడియో తీసి పోస్ట్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ.. యూ ట్యూబ్ ఏదో వీడియో చేస్తున్నట్టు చేసింది. కానీ తన బాధను వెళ్లగక్కింది. కొలువు లేక నానా ఆగచాట్లు పడుతున్నామని వాపోయింది. ప్రభుత్వం జాబ్ ఇవ్వడం లేదని.. నవ్వుతూనే వీడియో చేసింది. లో లోన తన బాధను దిగమింగింది. ఆ అమ్మాయి ఎవరో.. తెలియదు కానీ వీడియో మాత్రం వైరలవుతోంది.

డిగ్రీలు ఎందుకు..?
డిగ్రీ ఎందుకు.. గ్రాడ్యుయేషన్ చేస్తే మెమో ఇస్తారెమో.. కానీ అవీ ఎందుకు అని చెప్పింది. ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వదని తెలిపింది. అందుకే బర్లు కొన్నా అని.. ఏ మాత్రం నమోషి లేకుండా చెప్పింది. ఒక్కొ బర్రె 6 లీటర్ల పాలు ఇస్తోందని తెలియజేసింది. ఉదయం 3, సాయంత్రం 3 లీటర్ల చొప్పున పాలు ఇస్తోందని పేర్కొంది. ఒక్కో బర్రె వల్ల రూ.300 ఎటు పోవు అని చెప్పింది. అంటే రోజుకు రూ.1200 సంపాదిస్తానని గర్వంగా తెలియజేసింది. అంటే నెలకు రూ.36 వేలు సంపాదిస్తానని చెప్పింది. ఖర్చులు తీసివేసినా.. గౌరవంగా బతుకుతానని వివరించింది.

చాకలి నయం..
చదువుకున్నొడి కన్నా చాకలి నయం అనే సాత్రం ఉంది. దానిని పెద్దలు ఊరికే చెప్పలేదు. అవును.. ఎందుకంటే చాకలి రేవుకెళ్లి బట్టలు ఉతికి.. తిరిగి ఎవరి బట్టలను వారి ఇళ్లలో వేస్తారు. అందుకే అలా అంటారు. కానీ చదువు దారి చూపడం లేదని చాలా మంది అంటున్నారు. అందులో ఈ యువతి కూడా చేరారు. స్వయం ఉపాధి కోసం బర్లు కొన్నానని చెప్పింది. బర్లు, గొర్లు కాయడం నమోషీ ఏమీ కాదని నిరూపిస్తోంది. వాస్తవానికి ఈ యువతి.. మనో ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.. ఎందుకంటే చాలామంది చేయని పనిని చేసి చూపిస్తోంది.

ప్రైవేట్ సెక్టార్ ఇలా..
కరోనా వలల ఉపాధి సరిగా లేదు. మార్కెట్ కూడా అంత బాగా లేదు. దీంతో ప్రైవేట్ రంగం గురించి చెప్పక్కర్లేదు. ఈ సమయంలో స్వయం ఉపాధి వైపు.. యువత అడుగులు వేయాల్సి ఉంది. అందులో భాగంగానే యువతి అడుగులు వేసింది. మిగతా వారికి ఆదర్శంగా నిలిచింది. సర్కార్ నౌకరో.. ప్రైవేట్ జాబ్ కోసమో చూడలేదు. తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేసింది. మిగతా యువతకు ఆదర్శంగా నిలిచింది. ఆమెను మనం అందరం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాల్సిందే. ఆల్ ద బెస్ట్..