వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊరు మనదిరా ప్రతిధ్వనించే ఉంటుంది: గూడ అంజయ్యకు విరసం జోహార్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబదా్: ప్రజాకవి, సాహిత్యకారుడు, పోరాట పాటల సృష్టికర్త గూడ అంజయ్యకు విప్లవ రచయితల సంఘం (విరసం) నివాళులు అర్పించింది. ఈ మేరకు విరసం కార్యదర్శి వరలక్ష్మి బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదలే చేశారు. మంగళవారం సాయంకాలం అనారోగ్యంతో మరణించారన్న వార్త తెలిసిన వెంటనే చాలామందికి 'ఊరుమనదిరా' పాట ప్రతిధ్వనులు వినిపించి ఉంటాయని అభిప్రాయపడింది.

ప్రముఖ కవి గూడ అంజయ్య కన్నుమూత: కెసిఆర్ సంతాపం

విప్లవ సాంస్కృతికోద్యమానికి ప్రతీక వంటి పాట అది అని, ఆనాటి ఉద్యమం వర్గపోరాట సారాన్ని అంజయ్య కలం ద్వారా పలికించిందని అన్నారు. గ్రామాల్లో భూస్వామ్యాన్నిప్ర‌శ్నించిన పాట అది అని, మళ్ళీ తెలంగాణ ఉద్యమ సన్నివేశం కూడా అంజయ్య పాటలోనే అధ్బుతంగా పలికిందని అన్నారు.

hooda

ప్రజల నుండి ప్రజలకు అనే సూత్రాన్ని ఈ కవి అధ్బుతంగాఆచరించాడని ప్రశంసించారు. జీవిత నేపథ్యం వల్లనే కాదు, సాహిత్యోద్యమకారుడిగా ప్రజలతో ముడిపడిన ఆచరణ నుండి వ్యవస్థపై ఉరుముల వంటి పాటలు అచ్చంగా ప్రజల భాషలో, ప్రజల హృదయంతో ముడివేసుకొని పుట్టాయని అన్నారు.

తరువాతి దశలో దళిత దృక్కోణంతో ఆయన కథలు, నవల కూడా రాశారని గుర్తు చేశారు. ఏది రాసినా జీవితాంతం ప్రజల ఆరాటాన్నే కాలంలో నింపుకున్నారని అన్నారు. పోరాట పాటకు ఊపిరిపోసిన అంజయ్యకు విప్లవ రచయితల సంఘం జోహార్లర్పిస్తున్నట్లు తెలిపారు.

English summary
Revolutionary writers association VIRASAM condoled the demise of people's poet Gooda Anjaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X