• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎమ్మార్పీఎస్ కు విరసం మద్దతు : వర్గీకరణ న్యాయబద్దమంటూ లేఖ

|

హైదరాబాద్ : బీసీల్లో ఉన్న వర్గీకరణ ఎస్సీల్లో ఎందుకు సాధ్యపడదు? రిజర్వేషన్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే.. ఆయా వర్గాల మధ్య జనాభా ప్రాతిపదికన సమాన పంపిణీ జరగాలన్నది నిర్వివాదాంశం. అందుకే ఎస్సీ వర్గీకరణకు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది.

తాజాగా ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ డిమాండ్ కు తమ మద్దతు ప్రకటించింది విరసం (విప్లవ రచయితల సంఘం). వర్గీకరణ ద్వారా ఎస్సీ సామాజిక వర్గంలో.. బడుగు వర్గాలకు మరింత లబ్ది చేకూరుతుందన్న ఎమ్మార్పీఎస్ వాదనతో ఏకీభవిస్తూ.. ఎమ్మార్పీఎస్ డిమాండ్ ను నెరవేర్చాల్సిందిగా కేంద్రాన్ని నిలదీస్తోంది విరసం.

Virasam press note on SC classification

ఈ నేపథ్యంలోనే వర్గీకరణ డిమాండ్ ను బలపరుస్తూ పత్రికా ముఖంగా ఓ లేఖను విడుదల చేసింది విరసం. ఇందులో ఎస్సీ వర్గీకరణ కోసం 20 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది విరసం.

విరసం లేఖ :

"ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లోపెట్టాలి

ఢిల్లీలో జరుగుతున్న మాదిగల ఉద్యమానికిసంఘీభావం ప్రకటిద్దాం.."

ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాలు ఎస్సీలలోని 59 కులాలకుసమానంగా పంపిణీ చేయాలని గత ఇరవై రెండుసంవత్సరాలుగా ఎంఆర్‌పీఎస్‌ పోరాడుతున్నది. మాదిగఉప కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీరిజర్వేషన్‌ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టంచేయాలని విప్లవ రచయితల సంఘం(విరసం) కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది.

వేల సంవత్సరాలఅంటరానితనం, అణిచివేత వల్ల దళితులు విద్య, ఉద్యోగ,రాజకీయ అవకాశాలకు దూరమయ్యారు. ప్రజాస్వామ్యవ్యవస్థ రూపొందాలంటే సామాజిక న్యాయం ఒక షరతుగాఉండాలని డా. బిఆర్‌ అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారు.అందుకే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ిపొందుపర్చారు. దీని కోసం ఆయన ఆరోజుల్లో ఎన్నోపోరాటాలు చేయాల్సి వచ్చింది. కాని అగ్రకుల, దోపిడీపాలకులు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదు.

భారత దేశంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ దళితులలోకూడా అంతరాలను ఏర్పరిచింది. ఫలితంగా కొన్ని కులాలురిజర్వేషన్‌ ఫలాలను అందుకొని ముందుకుపోగా.. మరికొన్ని వెనుకబడిపోయాయి. ఈ అరవై అయిదేళ్ల కాలంలోఎస్సీ రిజర్వేషన్లను దళితుల్లోని ఒకటి రెండు కులాలేఅధికంగా ఉపయోగించుకున్నాయి. మిగతా చాలా కులాలువిద్య, ఉద్యోగాలకు ఆమడదూరంలో ఉన్నాయి. అట్టడుగునఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయంజరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి,బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీరిజర్వేషన్‌ ఫలాలు అందడం లేదు. రిజర్వేషన్‌లో ఉన్న ఈఅసమాన పంపిణీ పోవాలంటే ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరించిజనాభా దామాషా ప్రకారం కేటాయించాలి.

వర్గీకరణ సాధన కోసం మాదిగ, మాదిగ ఉపకులాలుచేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనది. ప్రజాస్వామికమైనది.కనుక కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాలలోనే ఎస్సీరిజర్వేషన్‌ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధతకల్పించాలని ఢిల్లీలో ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో మాదిగలుజూలై 19న ఆందోళన ప్రారంభించారు.

పార్లమెంట్‌సమావేశాలు జరిగే ఆగస్టు 12 దాకా ఈ ఉద్యమంనడుస్తుంది. మాదిగ ఉపకులాల్లోని అన్ని జనసముదాయాలు, మేధావులు, ప్రజాసంఘాలు పాల్గొంటున్నఈ ప్రజాస్వామిక ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లునుప్రవేశపెట్టి, దానికి చట్ట బద్ధత కల్పించాలని విప్లవ రచయితలసంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. ఈపోరాటానికి మిగతా పీడిత, దళిత కులాలల్లోని మేధావులు,రచయితలు, ప్రజాస్వామికవాదులు, మద్దతునివ్వాలనివిజ్ఞప్తి చేస్తున్నది.

వరలక్ష్మి(కార్యదర్శి),

వరవరరావు, కళ్యాణరావు, పాణి, కాశీం

English summary
Virasam (viplava rachayitala sangham) was released a press note on SC classification. Virasam supported MRPS in the issue of SC classification
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X