వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతో ఉన్నామంటూ ఈ మాటలా, 40 ఏళ్ల అనుభం లేదు కానీ: బాబుకు విష్ణు చురకలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీపై బీజేపీ శాసన మండలి సభ్యులు మాధవ్ మంగళవారం మండిపడ్డారు. సెంటిమెంటుతో పనులు జరగవని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారని, తెలంగాణ ఇచ్చారుగా అని చంద్రబాబు అంతకుముందు విమర్శించారు. కేంద్రంపై ధ్వజమెత్తారు.

చదవండి: తెలంగాణని లాగి జైట్లీపై బాబు తీవ్రంగా, మారుతున్న పరిణామాలు: జగన్‌కు బీజేపీ కితాబు

ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. ఓ వైపు తాము ఎన్డీయేలోనే ఉన్నామని చెబుతూ మరోవైపు చంద్రబాబు అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

చదవండి: మీ అన్నయ్య పార్టీని అడుగు, జగన్ బతికించారు, ఇన్నాళ్లేం చేశావ్: పవన్ డైలాగ్‌తో రోజా

అప్పడు జోన్ ఎందుకు తెచ్చుకోలేదు

అప్పడు జోన్ ఎందుకు తెచ్చుకోలేదు

కేంద్రంపై చంద్రబాబు మాటలను ఎలా అర్థం చేసుకోవాలని మాధవ్ ప్రశ్నించారు. కేంద్రం భాగస్వామ్యం లేకుండా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయా అని ప్రశ్నించారు. ప్రతిక్షాలు పన్నిన వలలో చంద్రబాబు చిక్కుకున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా ఉండగా విశాఖ రైల్వే జోన్ ఎందుకు తెచ్చుకోలేదన్నారు.

చంద్రబాబుకు విష్ణు కుమార్ రాజు చురకలు

చంద్రబాబుకు విష్ణు కుమార్ రాజు చురకలు

అసెంబ్లీ లాబీల్లో విష్ణు కుమార్ రాజు సీఎం చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. కేంద్రంపై టీడీపీ విమర్శల నేపథ్యంలో చురకలు అంటించారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం లేదని, మూడేళ్లు మాత్రమే అవుతోందని, కానీ తాను అబద్దాలు చెప్పనని, మాటలు మార్చనని, అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పనని వ్యాఖ్యానించారు.

రైల్వే జోన్ వస్తుంది

రైల్వే జోన్ వస్తుంది

మరోవైపు, రైల్వే జోన్ పైన విష్ణు కుమార్ రాజు అసెంబ్లీలో స్పందించారు. రైల్వే జోన్ రావడం లేదని ఎవరైనా అధికారికంగా ప్రకటన చేశారా అని ప్రశ్నించారు. విశాఖ హెడ్ క్వార్టర్‌గా రైల్వే జోన్ వచ్చి తీరుతుందన్నారు. రైల్వే జోన్ రావడం లేదనే రిపోర్టులు అవాస్తవమని అభిప్రాయపడ్డారు.

రిపోర్టులు ప్రజల్లో అనుమానాలు, ఆవేశాలు పెంచేందుకు

రిపోర్టులు ప్రజల్లో అనుమానాలు, ఆవేశాలు పెంచేందుకు

నిన్నటి రిపోర్టులు ప్రజల్లో అనుమానాలు, ఆవేశాలు పెంచేందుకేనని విష్ణు మండిపడ్డారు. అదే సమయంలో బీజేపీ, జగన్ కలుస్తుందనే ప్రచారాన్ని కూడా ఆయన కొట్టి పారేసిన విషయం తెలిసిందే. తమ మధ్య ఎలాంటి సీక్రెట్ డీలింగ్స్ లేవని, పబ్లిగ్గా టీడీపీతో కలిస్తే అయిదేళ్లు కలిసి ఉండమన్నారని, తమకు జగన్‌తో సీక్రెట్ డీలింగ్స్ ఉంటే బాహాటంగా చెబుతామని, నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలన్నారు.

English summary
Bharatiya Janata Party leaders Vishnu Kumar Raju and Madhav satire on AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X