వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును వదల్లేదు.. భారీగా అవినీతి జరిగిందన్న వివేక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత వివేక్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల ప్రాజెక్టు అని దుమ్మెత్తి పోశారు. కేసీఆర్‌కు ప్రజా ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి కొలువులు దక్కాయి గానీ .. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురచూస్తుందని పేర్కొన్నారు.

 vivek fire on cm kcr

కాళేశ్వరం ప్రాజెక్టును వాస్తవానికి తుమ్మడిహట్టి వద్ద నిర్మించాలన్నారు వివేక్. కానీ తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ అక్కడ నిర్మించలేదని విమర్శించారు. కేసీఆర్‌కు ఎప్పటికీ సొంత ప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. ప్రజల గురించి ఆయనకు పట్టదని ఫైరయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త కమీషన్ల ప్రాజెక్టుగా మార్చారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో భారీగా అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని .. కానీ కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యోగాలు లభించాయన్నారు. యువత కొలువులు లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. నీళ్ల విషయంలో అవినీతి చేస్తున్నారని తెలిపారు. నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు.

English summary
BJP leader Vivek fire on CM KCR. He was accused of massive corruption in projects. The Kaleswaram project is a commissions project. He criticized the public interest in KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X