హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘రామ్ అన్నా.. సూపర్ ఇంప్రెసివ్’: కెటిఆర్ ట్విట్టర్‌లో వివేక్ ఒబెరాయ్ ప్రశంస

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ‘వావ్! సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా! మీ కృషి చాలా బాగుంది' అంటూ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావుపై ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించారు. అపాచీ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించగానే హైదరాబాద్‌తో చిన్ననాటి నుంచి సంబంధం ఉన్న ఒబెరాయ్ స్పందించారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని ఒబెరాయ్ ప్రశంసించారు. తెలంగాణను టెర్రిఫిక్‌గా మారుస్తున్నారని కూడా ఒబెరాయ్ ట్వీట్ చేశారు.

ktr-vivek

హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ కోసం బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థలు జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ట్వీట్ చేయడంతో.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్పందించారు.

‘సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా' అంటూ తన ట్వీట్ మొదలుపెట్టారు. మీరు చేస్తున్న ప్రయత్నాల వల్ల 'హైదరాబాద్ హ్యాపెనింగ్' మాత్రమే కాదు, 'టెర్రిఫిక్ తెలంగాణ' సాధ్యమవుతోందని చెప్పారు. దానికి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.

వివేక్ భాయ్‌కి ధన్యవాదాలు చెబుతూనే, తమ హైదరాబాదీ ఒబెరాయ్ సాబ్ ఏం చేస్తున్నారని అడిగారు. వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్‌లో రాజ్యమేలినవారే. ఆయన సిసలైన హైదరాబాదీ. ఆయనకు తన వందనాలు అందజేయాలని కేటీఆర్ కోరారు.

English summary
Bollywood Actor Vivek Oberai on Tuesday praised Telangana IT minister KT Rama Rao for his achievements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X