మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వోల్వోలో మంటలు: ప్రయాణికులు సేఫ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మెదక్: ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బీజీఆర్‌ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (ఏపీ 13వై 0952) సోమవారం మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం చిరాగ్‌పల్లి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం.. 45మంది ప్రయాణీకులతో ఈ బస్సు ముంబై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది.

పుణె సమీపంలో బస్సులో ఉన్న ఎలక్ర్టిక్‌ వైర్లు కాలిపోయి లైట్లు పని చేయకపోవడంతో.. అక్కడే మరమ్మతులు చేయించి.. హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో మెదక్‌ జిల్లా చిరాగ్‌పల్లి గ్రామ శివారులోకి ప్రవేశించిన బస్సు ఇంజన్‌ నుంచి పొగలు రావడాన్ని.. అక్కడ రహదారి విస్తరణ పనులు చేస్తున్న ఎల్‌ అండ్‌ టి అధికారులు గమనించారు.

మంటల్లో వోల్వో బస్సు

మంటల్లో వోల్వో బస్సు

ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సులో సోమవారం ఉదయం హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

దగ్ధమైన వోల్వో బస్సు

దగ్ధమైన వోల్వో బస్సు

జహీరాబాద్ మండలం చిరాగ్‌పల్లి వద్ద బస్సు పూర్తిగా దగ్ధమైంది.

బస్సులో మంటలు

బస్సులో మంటలు

అయితే ఈ సంఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు నుంచి మంటలు రావటాన్ని రోడ్డుపై మరమ్మతు పనులు చేపడుతున్న ఎల్ అండ్ టి సిబ్బంది గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు.

బస్సులో మంటలు

బస్సులో మంటలు

దీంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.

పొగలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్‌కు సిగ్నల్స్‌ ఇచ్చినప్పటికీ.. గమనించకుండా వేగంగా ముందుకెళ్లాడు. దీంతో ఎల్‌అండ్‌టీ అధికారులు తమ వాహనంలో బస్సును వెంబడించి.. చిరాగ్‌పల్లి సమీపంలో దాన్ని ఆపేశారు. ఇంజిన్‌ నుంచి పొగలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్‌కు తెలియజేశారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులంతా భయంభయంతో వెంటనే కిందకి దిగారు.

అప్పటికే బస్సులో మంటలు చెలరేగాయి. చూస్తుండానే.. నిమిషాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కొంత మంది లగేజీ దగ్ధమైంది. బస్సులో చాలా మంది హైదరాబాద్‌కు, మరికొంతమంది గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఎల్‌అండ్‌టీ అధికారులు గమనించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులందరూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

English summary
A Volvo bus belonging to a private travels was reduced to ashes following flames erupting from its engine near Chiragpalli village under Zaheerabad mandal on the National Highway No 65 on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X