హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎన్నికలు: సూచనలు, హెచ్చరికలు, ఓటరు కార్డ్ లేకుంటే ఏం చేయాలి?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : Casting your vote, EVM and VVPAT : All You Need To Know | Oneindia

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 119 నియోజకవర్గాల్లో 1800 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటర్లకు పలు సూచనలు.

 ఓటరు కార్డుతో వెళ్లాలి

ఓటరు కార్డుతో వెళ్లాలి

ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తి తమ ఓటరు ఐడీ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకు వెళ్లాలి. వెళ్లే ముందు ఫోటో కలిగి ఉన్న ఓటరు ఓటరు స్లిప్‌ను వెంట తీసుకువెళ్లాలి. ఓటు వేసేందుకు ఓటరు ఎన్నికల సంఘం జారీ చేసిన ఎపిక్(ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్-ఓటరు కార్డు)ను చూపించవలసి ఉంటుంది.

పాస్‍‌పోర్ట్, పాన్‌కార్డ్

పాస్‍‌పోర్ట్, పాన్‌కార్డ్

ఎవరివద్దనైనా ఓటరు కార్డు లేకుంటే కనుక వారు గుర్తింపు కోసం వారు ఈ కింది గుర్తింపు కార్డులలో ఏదైనా తీసుకు వెళ్లాలి. 1. పాస్‌పోర్ట్. 2. డ్రైవింగ్ లైసెన్స్ 3. కేంద్ర, రాష్ట్ర, పీఎస్‌యూ/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ఫోటోలతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డులు. 4. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్‌లు విడుదల చేసిన పాస్‌బుక్‌లు (ఫోటోలు ఉండాలి. 5. పాన్‌కార్డ్.

ఓటరు కార్డు లేకుంటే మరిన్ని గుర్తింపు కార్డులు..

ఓటరు కార్డు లేకుంటే మరిన్ని గుర్తింపు కార్డులు..

6. ఎన్పీఆర్ కింద ఆర్జీఐ ఇచ్చిన స్మార్ట్ కార్డులు. 7. ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు. 8. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చిన హెల్త్ ఇన్సురెన్స్ స్మార్ట్ కార్డ్ 9. ఫోటోగ్రాఫ్ ఉన్న పింఛన్ డాక్యుమెంట్. 10. ఫోటో కలిగిన ఓటరు స్లిప్ 11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే అధికారిక ఐడెంటిటీ కార్డులు. 12. ఆధార్ కార్డు. వీటిని గుర్తింపు కార్డుగా తీసుకు వెళ్లవచ్చు.

 మరికొన్ని సూచనలు, హెచ్చరికలు

మరికొన్ని సూచనలు, హెచ్చరికలు

ఓటు వేసేందుకు వెళ్లే వారికి మరికొన్ని సూచనలు లేదా హెచ్చరికలు. పోలింగ్ సెంటర్‌లోకి తాగి వెళ్లవద్దు. సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. సెల్ఫీలు దిగితే సీరియస్ కేసులు పెడతారు. దుస్తులపై ఎలాంటి పార్టీ గుర్తులు ఉండవచ్చు. ఓ పార్టీని ప్రమోట్ చేసేలా ఎలాంటి హావభావాలు ప్రదర్శించవద్దు. వాహనాలను నిర్దేషించిన దూరంలో ఆపి, నడుచుకుంటూ వెళ్లాలి. తనిఖీలు చేస్తే సహకరించాలి. పోలింగ్ బూత్ సిబ్బందితో వాగ్వాదానికి దిగవద్దు. అంధులకు ఓటు వేసేందుకు బ్యాలెట్ యూనిట్‌లో బ్రెయిలీ లిపిలో ఉంటుంది.

సహాయం పొందవచ్చు

సహాయం పొందవచ్చు

'నా ఓటు' ద్వారా ఓటర్లు తమ పోలింగ్ సెంటర్‌కు ఎలా వెళ్లాలో తెలుసుకోవచ్చు. (నా ఓటును ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి). అదే విధంగా 'నా ఓటు' ద్వారా వికలాంగులు, వృద్ధులను ఉచితంగా పోలింగ్ సెంటర్ వద్దకు తీసుకు వెళ్లి, ఓటు వేశాక తీసుకు వస్తారు. నా ఓటులో అప్ లోడ్ చేసుకుంటే ఓటు వేసేందుకు సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఈ నెంబర్లకు ఎస్సెమ్మెస్ చేసి సహాయం పొందవచ్చు.

TS VOTE VOTERID NOను 9223166166 కు ఎస్సెమ్మెస్ చేయాలి.
TS VOTE VOTERID NOను 51969 కు కూడా ఎస్సెమ్మెస్ చేయవచ్చు.

English summary
Polling for the Telangana Assembly Elections will begin from 7 am on December 7 and will end at 5 pm in most locations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X