వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంతంగా సాగుతున్న పరిషత్ పోలింగ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. 2097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో భద్రం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది వేర్వేరు బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారు. ఎంపీటీసీ బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో, జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉన్నాయి.

తొలుత ఎంపీటీసీ ఓటు వేసి వచ్చిన తర్వాత జెడ్పీటీసీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెండు బ్యాలెట్ పత్రాలు ఒకేసారి ఇవ్వడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఒకదాని తర్వాత మరొకటి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ కొనసాగనుండగా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే ఓటు వేసే అవకాశం కల్పించారు.

నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులునువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులు

Voting underway for parishad polls
English summary
first phase of parishad polls for 195 ZPTC and 2,097 MPTC seats is underway in telangana. all necessary arrangement done by official for free and fair election. this time Election commission using pink color ballet paper for MPTC, White for ZPTC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X