వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు వేస్తూ సెల్ఫీ... రూ 4000 జరిమాన

|
Google Oneindia TeluguNews

సెల్పీలు ప్రస్తుత సమాజాన్ని డామినేట్ చేస్తున్న విషయం తెలిసిందే... చేతిలో ఫోన్ ఉంది కదా.. అని వినియోగదారులు ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. దీంతో కొన్ని సంధర్భాల్లో కేసుల్లో ఇరుక్కుంటున్న సంఘటనలు కోకల్లలు. ఈ నేపథ్యంలోనే ఓటు వేస్తూ పోలీంగ్ బూత్‌ల్లో సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని ఎన్నికల కమీషన్ ఎంత మోత్తుకున్న సెల్ఫీ బాబులకు మాత్రం చెవికి పట్టలేదు. దీంతో ఏకంగా పోలీంగ్ బూత్‌లోనే సెల్ఫీ దిగడంతో కేసు నమోదు అయింది. విచారణ అనంతరం కోర్టులో జరిమానా కూడ చెల్లించాడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓటరు.

జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన చిర్ర మోహన్ అనే ఓటరు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోతే గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకొన్నాడు. అత్యుత్సాహంతో ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. దీంతో విషయాన్ని గమనించిన పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మోహన్‌పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇక అప్పటి నుండి కరీంనగర్ జిల్లా కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా మోహన్ సెల్పీ తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. దీంతో మోహన్‌కు 4200 రూపాయల జరిమాన విధించారు.

voting with Selfie... Rs 4000 fined

సెల్ఫీల్లో వింత వింత ఫోటోలతో జనాలను ఆకట్టుకకోవాలనే ఆకాంక్ష కొంతమందిని కటకటాలపాలు కూడ చేస్తోంది. ముఖ్యంగా నిషేధిత ప్రాంతాల్లో సెల్ఫీలు దిగడంతో వారు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సెల్ఫీ మోజులో పడి ఎక్కడ దిగుతున్నామో తెలియకుండా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కదులుతున్న రైలు ముందు కోంతమంది సెల్ఫీలు తీసుకుంటే మరికొంత మంది నాగుపాములు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో తమ ఆనందం కోసం దీగుతున్న సెల్పీలతో ఏ ప్రమాదం వస్తుందో గమనించకుండా వ్యవహరిస్తున్నారు సెల్ఫీ బాబులు.

English summary
The court fined a voter who took a selfie while voting in the parliamentary election. Chirra Mohan, a voter from Jagatyala district, has been fined Rs.4200.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X