వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందారిపేట వీఆర్వో ఆత్మహత్య: తహసీల్దార్‌ తీరే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

వరంగల్ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండంలోని మాధన్పపేట గ్రామ శివారులో రూరల్‌ జిల్లా శాయంపేట మండంలోని మందారిపేట వీఆర్వో గోల్కొండ మహేందర్‌ (37) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండంలోని మాధన్పపేట గ్రామ శివారులో రూరల్‌ జిల్లా శాయంపేట మండంలోని మందారిపేట వీఆర్వో గోల్కొండ మహేందర్‌ (37) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎస్‌ఐ నాగబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రూరల్‌ జిల్లాలోని దామెర మండలంలోని కోగిల్‌వాయి గ్రామానికి చెందిన మహేందర్‌ రెండు సంవత్సరాలుగా శాయంపేట మండంలోని మందారిపేట వీఆర్వోగా పనిచేస్తూ పరకాలలో కుటుంబ సభ్యుతో కలిసి అద్దె ఇంటిలో ఉంటున్నాడు. ఇటీవల సాదాబైనామా భూము క్రమబద్ధీకరణ చేస్తుండడంతో అప్పటి తహసీల్దార్‌ రజని సూచన మేరకు కొంత మంది రైతుల నుంచి డబ్బు వసూలు చేసి తహసీల్దార్‌కు అప్పటించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

రెండు నెల క్రితం తహసీల్దార్‌ బదిలీకావడంతో రైతు సాదాబైనామా భూము క్రమబద్ధీకరణ జరగకపోవడంతో రైతులు డబ్బు కోసం వీఆర్వోను ఒత్తిడి చేశారు. దీంతో రైతు సాదాబైనామాను క్రమబద్ధీకరించాని, పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్‌ను రైతులు, వీఆర్వో అడిగినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. దీంతో కొన్ని రోజులుగా డబ్బు కోసం రైతు వీఆర్వో మహేందర్‌ ఇంటికి, కార్యాసయానికి వెళ్లి ఒత్తిడి చేశారు.

VRO commits suicide in Warangal urban district

తమకు డబ్బులైనా ఇవ్వాసని, లేనిచో పట్టా పాసుపుస్తకాలైనా ఇవ్వాసని వీఆర్వోను రైతులు డిమాండ్‌ చేశారు. దీంతో రైతులు సాదాబైనామా పట్టా చేయాలని మహేందర్‌ ఆర్‌ఐ నూతన్‌ప్రసాద్‌ను వేడుకున్నాడు. దీనికి ఆర్‌ఐ తనకు డబ్బులు ఇస్తేనే సాదాబైనామాలు చేస్తానని వీఆర్వోను వేధించాడని ఆరోపించారు.

దీంతో కొన్ని రోజుగా మెడికల్‌ సెలవుపెట్టి మహేందర్‌ విధులకు వెళ్లడంలేదన్నారు. అయినా రైతుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో మనస్తాపం చెందిన మహేందర్‌ ఎలాగైనా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుగా ఇంటికి సైతం సరిగా వెళ్లడంలేదు. కాగా, వీఆర్వో మహేందర్‌ అత్తగారిల్లు మండలంలోని శనిగరం గ్రామం. పక్కనున్న మాధన్నపేటలో వీఆర్వో ఇద్దరు సోదరిలు ఉన్నారు.

పది రోజుగా మహేందర్‌ మాధన్నపేట గ్రామ శివారులోకి సాయంత్రం వచ్చి వెళ్లిపోతున్నాడని తెలిపారు. చనిపోవాసని నిర్ణయించుకున్న మహేందర్‌ కంఠాత్మకూర్‌లో పురుగు మందుకొనుగోలు చేసి, ఓ తాడును సైతం తనవెంట తీసుకొని మద్యంతోపాటు జిల్లా సరిహద్దు గ్రామమైన మాధన్నపేట గ్రామశివారులోకి తన ద్విచక్రవాహనంపై వెళ్లి శనివారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉదయం మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు బంధువుకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్ళిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని చూసి రోదించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య కరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నాగబాబు పేర్కొన్నారు.

English summary
Mandarivillage VRO Mahender commit ed suicide consuming pesticides in Warangal urban district of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X