వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా వచ్చి కూర్చోవాలి: కంచ ఐలయ్య కొత్త ట్విస్ట్, సమాధానం చెప్పలేకనా?

సామాజిక స్మగ్లర్లు వైశ్యులు అంటూ కంచ ఐలయ్య రాసిన పుస్తకం కలకలం రేపుతోంది. తన పుస్తకంపై ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని నెలన్నర రోజులుగా వైశ్య సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు వైశ్యులు అంటూ కంచ ఐలయ్య రాసిన పుస్తకం కలకలం రేపుతోంది. తన పుస్తకంపై ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని నెలన్నర రోజులుగా వైశ్య సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి.

చదవండి: ఐలయ్యా! మా ఆడపడుచులు వస్తారు: టీజీ గట్టి కౌంటర్, కాళ్లు విరగ్గొట్టండి: మాగంటి

తొలుత వైశ్య నేతలతో చర్చలు జరుపుతానని చెప్పి ఐలయ్య ఇప్పుడు అమిత్ షా వస్తే చర్చిస్తానని చెబుతున్నారు. తన పుస్తకంపై ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక ఆయన ఇప్పుడు అమిత్ షా చర్చలకు రావాలని పిడివాదన చేస్తున్నారని అంటున్నారు.

యూటర్న్ తీసుకున్న కంచ ఐలయ్య

యూటర్న్ తీసుకున్న కంచ ఐలయ్య

కంచ ఐలయ్య ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతామని స్పష్టం చేశాయి. అంతకుముందు తాను చర్చకు సిద్ధమని ఐలయ్య ప్రకటించారు. కానీ ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. చర్చల కోసం ఆదివారం వైశ్య నేతలు ఆయన ఇంటికి బయలుదేరారు. అయితే తన ఇంటికి ఎవరైనా వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. తద్వారా ఆయన చర్చపై యూ టర్న్ తీసుకున్నారు.

క్షమాపణ చెప్పాలి లేదా నిరూపించాలి

క్షమాపణ చెప్పాలి లేదా నిరూపించాలి

చర్చకు రాకుంటే ఐలయ్య తాను రాసిన పుస్తకంపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైశ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే తాను రాసిన పుస్తకం సరైనదేనని ఆయన నిరూపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం ఐలయ్య ఇంటికి పలువురు వైశ్య నేతలు బయలుదేరారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అక్కడ ఉద్రిక్తత

అక్కడ ఉద్రిక్తత

తార్నాకలోని ఐలయ్య నివాసానికి వైశ్య సంఘాల నేత శ్రీను, మరికొందరు వైశ్య ప్రముఖులు వెళ్లారు. మరోవైపు ఐలయ్య మద్దతుదారులు కొందరు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలను కలవనిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశాయి. వైశ్య నేతలను పోలీసులు తార్నాక ఫ్లై ఓవర్ సమీపంలో అడ్డుకున్నారు.

ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు

ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు

కాగా, తన ఇంటికి వచ్చి గొడవ చేయాలని వైశ్యులు చూస్తున్నారని కంచ ఐలయ్య ఆరోపించారు. వీరంతా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొత్తులు అని మండిపడ్డారు. తన ఇంటికి రావడానికి శ్రీనివాస్ గుప్తా ఎవరని ప్రశ్నించారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చి తనను చర్చకు ఆహ్వానిస్తే వస్తానని, వైశ్యులు జాతికి చేసిన ద్రోహంపై మాట్లాడుతానని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అమిత్ షాత్ చర్చలా

అమిత్ షాత్ చర్చలా

చదువురాని వారితో తాను చర్చకు వెళ్లే ప్రసక్తి లేదన్నారు. చేతనైతే అమిత్ షా వచ్చి తనతో బహిరంగ చర్చకు రావాలన్నారు. అయితే, కంచ ఐలయ్య లాంటి అజ్ఞానులతో అమిత్ షా వంటి జాతీయస్థాయి నేత చర్చకు రావాలని కోరడం ఐలయ్య మూర్ఖత్వమని, ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ అని వైశ్య ప్రతినిధులు అంటున్నారు.

English summary
Vysya leaders towards Kancha Ilaiah house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X