• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాహ్ కేసీఆర్ జీ... పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపనే కాలేదు .. ఓపెనింగ్ డేట్ ఇచ్చేశారే..

|

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు, చేసే వ్యాఖ్యలు ఏవైనా సరే ఆసక్తికరంగానే ఉంటాయి . ఇక ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు ఏ మాత్రం అందుబాటులో ఉండని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు మూడ్ బాగుంటే ఉన్నట్లుండి సమావేశాలు పెడతారు . ఊపిరి ఆడకుండా అధికారులను పరుగులు పెట్టిస్తారు . నాలుగైదు రోజులు హడావుడి చేసిన తర్వాత మళ్లీ మాయమవుతారు. ఇక తాజాగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన హడావిడి చేసిన సీఎం కేసీఆర్ అధికారులకు, పార్టీ నాయకులకు పనులు ఫుల్ గా పురమాయించారు.

రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో వెళ్తున్నారో నాకు చెప్పారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..పార్టీ మార్పు ఫిక్సే

  నేడు అమరావతి రానున్న తెలంగాణ సీఎం
  31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై కేసీఆర్ నిర్ణయం

  31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై కేసీఆర్ నిర్ణయం

  ఇటీవల మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి గంటల తరబడి చర్చించిన సీఎం కేసీఆర్ అనంతరం ప్రెస్ మీట్ పెట్టి తాను తీసుకున్న నిర్ణయాల్ని ప్రకటించారు. అందులో తమ పార్టీకి సంబంధించిన అంశాలపై ఆయన ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించటానికి వీలుగా భూములు కేటాయిస్తూ నిర్నయాన్ని తీసుకున్న ఆయన ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక బీజేపీ లాంటి పార్టీలు ఇప్పటికే తమకు భూమి కేటాయిస్తే పార్టీ కార్యాలయాల్ని నిర్మించుకుంటామని చెప్పినా ఆ వినతిని పరిగణలోకి తీసుకోలేదు సీఎం కేసీఆర్.

  24 న అన్ని పార్టీ కార్యాలయాల శంకుస్థాపన .. దసరా కు ప్రారంభోత్సవం అని ప్రకటించిన కేసీఆర్

  24 న అన్ని పార్టీ కార్యాలయాల శంకుస్థాపన .. దసరా కు ప్రారంభోత్సవం అని ప్రకటించిన కేసీఆర్

  ఇక పార్టీ కార్యాలయాల కోసం భూమిని కేటాయించిన కేసీఆర్ ఈ నెల24న ఒకే సమయంలో అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక అలాగే ఏక కాలంలో జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేయాలని నిర్ణయించారు. ఒక జిల్లా మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎకరం విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు స్థలాన్ని కూడా కేటాయించారు. ఇక తాజాగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అయ్యే ఖర్చుకు రూ.19.20 కోట్లు విడుదల చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు . శంకుస్థాపనకు మరో నాలుగు రోజులు సమయం ఉన్న పరిస్థితి. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు భవనాల్ని వేగంగా నిర్మించాలని, దసరా నాటికి అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల్ని ఒకేసారి ప్రారంభించుకోవాలన్న ఓపెనింగ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.

   దసరా దాకా పార్టీ నేతలకు చేతి నిండా పని అప్పగించిన కేసీఆర్

  దసరా దాకా పార్టీ నేతలకు చేతి నిండా పని అప్పగించిన కేసీఆర్

  శంకుస్థాపనకు ముందే , ప్రారంభోత్సవాలు ఎప్పుడు జరగాలో డిసైడ్ చేసిన కేసీఆర్ పార్టీ నేతలకు కూడా దసరా దాకా చేతి నిండా పని అప్పగించారు. హడావిడి నిర్ణయాలు తీసుకోవటం , వాటిని ప్రకటించటమే కాదు ఆ నిర్ణయాల ఫలితం ఎలా ఉంటుందో కూడా అరటిపండు ఒలిచినట్టు చెప్పటం కేసీఆర్ కు అలవాటు. అందుకే ఆయన తాజా ప్రకటనపై వాహ్ కేసీఆర్ జీ... పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపనే కాలేదు .. ఓపెనింగ్ డేట్ ఇచ్చేశారే అంటూ చర్చించుకోవటం ఇదంతా చూస్తున్న జనాల వంతు అవుతుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  KCR, who allotted land for party offices, was ordered to complete the Foundation of the party offices in all the districts at the same time on 24th of this month. This coup event is going to be very grand. Excluding a district, the party has decided to set up a party office in acre land in all districts of the state. The place was also allocated.The party's decision to release Rs 19.20 crore for the expenditure of the party's newly built office, Fixing opening date for opening party offices in all districts by Dasara.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more