• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీకి 25 లక్షలు (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా హోల్‌‌సేల్, రిటైల్ రంగంలో అగ్రగ్రామిగా ఉన్న వాల్‌మార్ట్ సంస్ధ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భగా వారికి స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచడంలో మరింత చొరవ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాల్‌మార్ట్ సీఈవో డేవిడ్ చీస్‌రైట్, ఇండియాశాఖ సీఈవో క్రిష్‌అయ్యర్, వైస్‌ప్రెసిడెంట్ రజనీష్‌కుమార్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

నగరంలో 4, 5 శాఖలతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా శాఖలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాల్‌మార్ట్‌లాంటి సంస్థలు రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు చేస్తున్న యత్నాలు బాగున్నాయని కొనియాడారు.

సమావేశం అనంతరం వాల్‌మార్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థకు అనుమతుల విషయంలో ప్రభుత్వహామీపై హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణలో అన్ని షాపులు, మాల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఒక రోజు కచ్చితంగా సెలవు ఇవ్వాలనే నిబంధన విధిస్తామని చెప్పారు. ఆదివారాలు షాపులు తెరిస్తే 20శాతం అధికంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వారు తెలిపారు.

కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా హోల్‌‌సేల్, రిటైల్ రంగంలో అగ్రగ్రామిగా ఉన్న వాల్‌మార్ట్ సంస్ధ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భగా వారికి స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచడంలో మరింత చొరవ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాల్‌మార్ట్ సీఈవో డేవిడ్ చీస్‌రైట్, ఇండియాశాఖ సీఈవో క్రిష్‌అయ్యర్, వైస్‌ప్రెసిడెంట్ రజనీష్‌కుమార్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

35ఏళ్లుగా నడుస్తున్న కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ ఏడాదిగా మూతపడడంవల్ల వందలమంది కార్మికులు, వారి కుటుంబీకులు రోడ్డున పడ్డారని బిల్ట్ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ముడిసరుకుగా యూకలిప్టస్ చెట్లు, సింగరేణి నుంచి బొగ్గు, సబ్సిడీతో విద్యుత్ కావాలని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

 కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

మూతబడిన బిల్ట్ (బల్లాపూర్ ఇండస్ట్రీ లిమిటెడ్)ను పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా కమలాపూర్‌లో మూతపడిన ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించి కార్మికులను కాపాడుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలని, ఇక్కడ యువతకు ఉపాధి దొరకాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

 కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

కమర్షియల్ ఫైలట్ శిక్షణ కోసం అమెరికా వెళ్తున్న అజ్మీరా బాబికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించింది. సాయం విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను బుధవారం సచివాలయంలో బాబీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు.

 కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

కేసీఆర్‌తో వాల్‌మార్ట్‌, ట్రైనీ పైలెట్‌కు 25 లక్షలు

శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి ఫైలట్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఆదిలాబాద్‌కు చెందిన బాబి పైలట్ ఉద్యోగానికి ఎంపికైంది. అయితే కుటుంబ పరిస్ధితుల నేపథ్యంలో శిక్షణకయ్యే మొత్తాన్ని భరించే శక్తిలేక మంత్రి అజ్మీరా చందులాల్ ద్వారా సీఎంను ఆశ్రయంచారు.

English summary
Walmart delegates met CM KCR over company expansion in state - Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X