హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3శాఖల మంత్రి కెటిఆర్‌కు భద్రత పెంపు: హైదరాబాద్‌లో వాల్‌మార్ట్ మెగాస్టోర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముందస్తు జాగ్రత్తలో భాగంగా మూడు శాఖలు నిర్వహిస్తున్న మంత్రి కెటి రామారావుకు అదనపు భద్రత కల్పించారు. ఐటీ, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖలు చూస్తున్న ఆయనకు ఇప్పటికే బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం, ఇద్దరు గన్‌మెన్లు, ఇంటివద్ద భద్రత వంటివి కల్పిస్తున్నారు.

కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరఫున కేటీఆర్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు భద్రత పెంచారు. ప్రత్యేకంగా మరో వాహనం కేటాయించి అదనంగా భద్రతా సిబ్బందిని నియమించారు. దీన్ని కూడా ప్రస్తుతం కొనసాగించనున్నారు.

హైదరాబాద్‌లో వాల్‌మార్ట్ మెగాస్టోర్

ప్రముఖ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో సహకారానికి మూడు ఎంవోయూలు కుదుర్చుకోవడానికి సిద్ధమైంది. అదే దారిలో నార్వే దేశపు పారిశ్రామిక బృందం తెలంగాణలో ఐటీ, లైఫ్‌సైన్సెస్, హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంసిద్ధత వ్యక్తపరిచింది.

మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో వాల్‌మార్ట్ లాటిన్ అమెరికా అండ్ ఆఫ్రికా సీఈవో ఎన్రిక్‌ఓస్టలే సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల అంశం మీద చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో మూడు అంశాల్లో అవగాహన ఒప్పందాలకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

అందులో తెలంగాణలో మహిళలరే గ్రాసరీ(కిరాణా) షాపులు నిర్వహించేందుకు వాల్‌మార్ట్ తరఫున ప్రోత్సాహం అందించటం, రాష్ట్ర హార్టీకల్చర్ కార్పొరేషన్ ద్వారా పండ్లు, కూరగాయలు వాల్‌మార్ట్ కొనుగోలు చేయటం , గ్రామీణ ఉపాధి, నిర్మూలన సంస్థ( సెర్ఫ్) ద్వారా ఏర్పాటు చేసిన కృషి మార్ట్‌ల నిర్వహణ మెరుగుపరచటం, అభివృద్ధి పరచటం ఉన్నాయి. ఈ మూడు అంశాలపై నెలాఖరులోగా అవగాహన ఒప్పందాలు పూర్తవుతాయి.

మౌలిక వసతుల్లో పెట్టుబడులకు నార్వే రెడీ

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని నార్వే రాయబారి నిల్స్ రిగ్నర్ కామ్స్‌వగ్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మంత్రి కేటీఆర్‌తో నార్వే బృందం సమావేశమై వాణిజ్య సంబంధాలు, వ్యాపారాభివృద్ధిపై చర్చించింది. హైదరాబాద్ నగరంలోని వివిధ మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ ఆయనకు సూచించారు.

నగరాభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను ఆయనకు వివరించారు. నగరంలో చేపట్టబోయే స్కైవేలు, చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపైన నార్వే బృందం ఆసక్తి చూపింది. ఈ దిశగా ఫండ్ మేనేజర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని నార్వే రాయబారి హామీ ఇచ్చారు. ఐటీరంగంతో పాటు లైఫ్ సైన్సెస్ రంగాల్లోనూ పెట్టుబడులకు నార్వే సంస్థలకు ఆసక్తి ఉందని వివరించారు.

అంతేగాక, మార్చిలో ఢిల్లీలో జరిగే నార్వే సంస్థల సమావేశానికి రావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ యం జీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

నార్వే ప్రతినిధులతో కెటిఆర్

నార్వే ప్రతినిధులతో కెటిఆర్

ప్రముఖ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్, నార్వే దేశపు పారిశ్రామిక బృందం తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో సహకారానికి మూడు ఎంవోయూలు కుదుర్చుకోవడానికి సిద్ధమైంది.

నార్వే ప్రతినిధులతో కెటిఆర్

నార్వే ప్రతినిధులతో కెటిఆర్

నార్వే దేశపు పారిశ్రామిక బృందం తెలంగాణలో ఐటీ, లైఫ్‌సైన్సెస్, హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంసిద్ధత వ్యక్తపరిచింది.

వాల్‌మార్ట్ ప్రతినిధులతో కెటిఆర్

వాల్‌మార్ట్ ప్రతినిధులతో కెటిఆర్

మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో వాల్‌మార్ట్ లాటిన్ అమెరికా అండ్ ఆఫ్రికా సీఈవో ఎన్రిక్‌ఓస్టలే సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల అంశం మీద చర్చించారు.

వాల్‌మార్ట్ ప్రతినిధులతో కెటిఆర్

వాల్‌మార్ట్ ప్రతినిధులతో కెటిఆర్

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో మూడు అంశాల్లో అవగాహన ఒప్పందాలకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో వాల్‌మార్ట్ మెగాస్టోర్

హైదరాబాద్‌లో వాల్‌మార్ట్ మెగాస్టోర్

అందులో భాగంగా తెలంగాణ మహిళలే గ్రాసరీ(కిరాణా) షాపులు నిర్వహించేందుకు వాల్‌మార్ట్ తరఫు ప్రోత్సాహం అందించటం, రాష్ట్ర హార్టీకల్చర్ కార్పొరేషన్ ద్వారా పండ్లు, కూరగాయలు వాల్‌మార్ట్ కొనుగోలు చేయటం , గ్రామీణ ఉపాధి, నిర్మూలన సంస్థ( సెర్ఫ్) ద్వారా ఏర్పాటు చేసిన కృషి మార్ట్‌ల నిర్వహణ మెరుగుపరచటం, అభివృద్ధి పరచటం ఉన్నాయి. ఈ మూడు అంశాలపై నెలాఖరులోగా అవగాహన ఒప్పందాలు పూర్తవుతాయి.

English summary
American retail giant Walmart will soon sign three pacts with the Telangana government to expand its footprint in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X