• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డౌట్స్ అడిగితే ఇంటికి పిలిచాడు.. నమ్మి వెళ్లినందుకు నీచానికి ఒడిగట్టిన టీచర్..

|

మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. ఎంత కఠిన వైఖరిని అవలంభిస్తున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. బాగా చదువుకున్నవాళ్లు,గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్నవారు సైతం మహిళల పట్ల ఆకృత్యాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. చివరకు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవాళ్లలోనూ కొంతమంది కీచకులు అమాయక విద్యార్థినులను కాటేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లా పెద్దూరు గ్రామంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

గురుకుల కోచింగ్..

గురుకుల కోచింగ్..

నాగర్‌కర్నూలు జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు వనపర్తి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు కోచింగ్ కూడా ఇచ్చేవాడు. అలా అతని వద్ద కోచింగ్ తీసుకుంటున్న నాలుగో తరగతి విద్యార్థినుల్లో కొంతమంది పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఎవరైనా బాలికలు పాఠ్యాంశాలకు సంబంధించి సందేహం అడిగితే.. స్కూల్ అయిపోయాక ఇంటికి రమ్మనేవాడు.

టీచర్ అని నమ్మి వెళ్తే..

టీచర్ అని నమ్మి వెళ్తే..

టీచర్ అన్న నమ్మకంతో అతని ఇంటికి వెళ్తే.. అతను మాత్రం బాలికలపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడు. వారిని బెదిరింపులకు గురిచేసి లైంగిక దాడి చేసేవాడు. అంతేకాదు,విషయం ఎవరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించేవాడు. ఇదే క్రమంలో ఇటీవల ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం(మార్చి 6)న బాలిక స్నానం చేస్తుండగా.. ఆమెకు రక్తస్రావం కావడాన్ని తల్లి గమనించింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్టు నిర్దారించారు.

స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే...

స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే...

బిడ్డపై అత్యాచారం జరిగిందని తెలియడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. ఏం జరిగిందని బాలికను అడగ్గా.. అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లింది. తమ బిడ్డపై జరిగిన అత్యాచారానికి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసింది. స్కూల్లో ఉన్నంతవరకు విద్యార్థినుల బాధ్యత తమదేనని.. శరత్ ఇంట్లో బాలికపై అత్యాచారం జరిగితే తాము బాధ్యత వహించలేమని చెప్పారు. బాలికలను శరత్ ఇంటికి వెళ్లమని తాము చెప్పలేదని.. అలాంటప్పుడు మీరెలా పంపించారని యాజమాన్యం బాధిత బాలిక కుటుంబ సభ్యులను ప్రశ్నించింది.

  Shop Keeper Selling Face Masks Higher Than MRP | వినియోగదారులు మేలుకోండి ! | Oneindia Telugu
  దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత

  దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత

  పాఠశాల యాజమాన్యం తప్పు లేకపోవడంతో ఇక శరత్‌నే పట్టుకుని నిలదీయాలనుకున్నారు. గురువారం కొల్లాపూర్‌లో అతన్ని పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చారు. అంతా నిలదీయడంతో సదరు టీచర్ నేరం ఒప్పుకున్నాడు. మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డానని చెప్పాడు. అంతేకాదు,మరికొందరు బాలికల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించినట్టు అంగీకరించాడు. దీంతో అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

  English summary
  Wanaparthy police arrested a teacher who had been working at a Private school, for allegedly molesting minor girls, over the past few months.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more