వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరా వ్యాపారం, ఓటు వేయి , డిస్కౌంట్ పట్టు

|
Google Oneindia TeluguNews

ఓటు వేయి ,ఆఫర్ పట్టు, ఓవైపు సమాజీక సేవ మరోవైపు వ్యక్తిగత వ్యాపారం ,ప్రస్తుత ఎన్నికల్లో రెండు కలిసివస్తున్నాయి వ్యాపారస్తులకు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే వ్యాపారస్తులు తమ లాభల ఆలోచనలకు తెర లేపారు, ఓటువేసి డిస్కౌంట్ పట్టమంటూ ఆఫర్లు ప్రకటించారు, పలు రాష్ట్రాల వ్యాపారస్తులు.

వ్యాపారపరమైన సిరా చుక్క

వ్యాపారపరమైన సిరా చుక్క

వ్యాపారం అంటేనే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ,అందుకే ఎన్నికలను ఆఫర్ల సీజన్ లా మార్చారు వ్యాపారులు, ప్రస్థుత రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకోమనే ప్రచారం విపరీతంగా పెరుగుతోంది.ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లు ఓట్లు వేసేందుకు బద్దకిస్తారు.లేదంటే ఆరోజు సెలవుదినంగా భావించి వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతున్నారు. దీంతో ఎన్నికల కమీషన్ పట్టణాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే సామాజిక సంస్థలు సైతం ప్రచారం చేస్తున్నాయి.అయితే ఇదే అవకాశాన్ని వ్యాపారస్తులు సద్వినియోం చేసుకుంటున్నారు. ఓటు వేసి తమకు చూపిస్తే పలు సంస్థలు డిస్కౌంట్ లు ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగానే ఫుడ్ రెస్టారెంట్ లు మొదలుకుని పెట్రోల్ ,బంగారం వరకు ఆఫర్లు ప్రకటించారు.

తమిళనాడులో హోటళ్లలో 10 డిస్కౌంట్

తమిళనాడులో హోటళ్లలో 10 డిస్కౌంట్

ఎన్నికల నేపథ్యలంలో ఓటింగ్ శాతాన్ని పేంచేందుకు తమిళనాడు హోటల్స్ అసోసియెషన్ 10 డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. తమకు నచ్చిన హోటల్ లో మెచ్చిన ఫుడ్ మీద పది శాతం తగ్గింపును ప్రకటించింది. ఇందుకోసం కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 18న రెండో దశలో ఓటింగ్ జరగనుంది.

 డాక్టర్లు సైతం ఫీజుపై తగ్గింపు,

డాక్టర్లు సైతం ఫీజుపై తగ్గింపు,

ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ వైద్యులు కూడ తమ కన్సల్టేషన్ ఫీజులో 50 శాతం తగ్గింపునిచ్చారు. ఈనేపథ్యంలోనే ఎక్స్‌రే ,ఎంఆర్ఐ లాంటీ టెస్ట్ లపై కూడ మరో 20శాతం తగ్గింపునిచ్చారు.కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200 వందల మంది వైద్యులు ఇందుకు అంగికరించానట్టు యూనియన్ నాయకులు చెప్పారు.

బంగారం పై కూడ తగ్గింపు

బంగారం పై కూడ తగ్గింపు

రెండవ విడత ఆసోంలో జరిగే ఎన్నికల్లో ఏకంగా బంగారంపై మేకింగ్ చార్జీలపై డిస్కౌంట్ లను ప్రకటించారు.అయితే ఇందుకోసం ఆసోంలోని సిల్చార్ నియోజకవర్గపరిధిలో జిల్లా ఎన్నికల అధికారి ఓ వినూత్న ప్రచారం చేశారు.ఓటువేసిన వారికి వారు కొనే వస్తువుల మీద తగ్గింపులు ప్రకటించాలని పలువురు వ్యాపారులను కోరింది. దీంతో ఆమే అభ్యర్థనపై స్పందించిన వ్యాపారులు బంగారం మేకింగ్ చార్జీలపై 15 శాతాన్ని తగ్గించారు.ఇదే విధంగా పలు హోటళ్లు, మెడికల్ షాప్ యజమానులు తో పాటు పలువురు యజమానులు ముందుకు వచ్చారు.

లీటర్ పేట్రోల్ పై 50 పై తగ్గింపు

లీటర్ పేట్రోల్ పై 50 పై తగ్గింపు

కొద్ది కాలం క్రితం పలు పెట్రోల్ కంపనీలు ఓటు వేసిన వారికి ప్రతి లీటర్ పెట్రోల్ పై 50 లను తగ్గించారు. మరో చిన్న వ్యాపారులు సైతం ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు. సో ఏదైతేనేమీ ఎన్నికల వేళ అటు వ్యాపారం ఇటు సామాజిక రెండు జరగడం మంచి పరిణామమే.

English summary
Here is a piece of good news if you have decided to vote on the polling day. To all the voters, who cast their vote will get a special discount on food,petrol, diesel,gold also
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X