బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ఈ ఆన్‌లైన్ పోర్టల్ రక్ష!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకునే వారిని మనం రోజూ పత్రికలలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. నిన్ననే టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రముఖులు ఆత్మహత్య చేసుకుంటే వార్తల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. రోజు పేపర్లలో ఆత్మహత్యలు చూస్తూనే ఉంటాం.

ఈ నేపథ్యంలో ఆత్మహత్యలను ఆపాలనే సదుద్దేశ్యంతో రిచా సింగ్ అనే యువతి కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిన వారిని దాని నుంచి కాపాడేందుకు రిచా ఓ ఆన్ లైన్ పోర్టల్‌ను తీసుకు వచ్చింది. అది యువర్ దోస్త్ డాట్ కామ్. (www.yourdost.com)

ఈ పోర్టల్‌లో సైకాలజిస్టులు, సలహాదారులు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా జీవితం పైన విరక్తి కలిగితే ఈ పోర్టల్ సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది.

Want to commit suicide? This portal will prevent you from taking extreme step!

మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... ఈ పోర్టల్ ప్రారంభించిన రిచా ఐఐటి గౌహతిలో చదివింది. ఉద్యోగం దొరకక ఒత్తిడిలో ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమెకు ఈ ఆలోచన వచ్చిందని తెలుస్తోంది.

ప్రొఫెషనల్‌గా, అకడమిక్‌గా, వ్యక్తిగతంగా ఒత్తిడిలో కూరుకుపోయిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే పోర్టల్ తమది అని రిచా సింగ్ చెబుతున్నారు.

మీ వ్యక్తిగత భావోద్వేగాలకు 'యువర్ దోస్త్' పర్సనల్ ట్రెయినర్ అని, విశ్వసించదగిన ఆన్‌లైన్ ఫ్రెండ్ అని, ఈ పోర్టల్ ద్వారా మీరు నిపుణులతో మాట్లాడవచ్చునని.. ఆ వెబ్‌సైట్ చెబుతోంది. ప్రొఫెషనల్‌గా నిష్ణాతులైన కౌన్సెలర్లు మీకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటారని పేర్కొంటుంది.

పని ఒత్తిడి, రిలేషన్‌షిప్, ప్రతిష్ట... తదితర ఏ విషయాల్లోనైనా అండగా ఉంటామని ఈ పోర్టల్ చెబుతోంది. అంతేకాదు, నిపుణులతో ఈ పోర్టల్ ద్వారా చాటింగ్ చేయవచ్చు. అపాయింటుమెంట్ తీసుకోవచ్చు. ఇది 24X7 గంటలు అందుబాటులో ఉంటుంది. ఒత్తిడిలో ఉండేవారిలో ధైర్యం నూరిపోసే ఈ పోర్టల్.. ఎవరి సమాచారాన్ని అయినా రహస్యంగా ఉంచుతుంది.

English summary
At a time when daily newspapers and news channels show news reports, showing people committing suicides, for even petty reason, an IIT alumnus, Richa Singh, has come up with a novel idea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X