వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ మొదలైన వార్..! కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న మంద క్రిష్ణ..! 27న మహాగర్జన..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి, ఎంఆర్పీఎస్ జాతీయ అద్యక్షుడు మంద క్రిష్ణ మాదిగకు వద్య వ్యవహారం మళ్లీ ముదురుతోంది. అంబేద్కర్ ఉత్సవాలకు చంద్రశేఖర్ రావు కావాలనే హాజరుకావడం లేదంటూ., చంద్రశేఖర్ రావు తీరుకు నిరశనగా ఉద్యమాలు చేపడుతామని మంద క్రిష్ణ ఇటీవల ప్రకంటించారు. ముఖ్యమంత్రి తీరుకు నిరశనగా కొన్న కార్యక్రమాలకు కూడా మంద క్రిష్ణ రూపకల్పన చేసారు.

రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమ బాట..! కొంపముంచనున్న సీఎం ప్రకటన..!!రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమ బాట..! కొంపముంచనున్న సీఎం ప్రకటన..!!

27వ తేదీన హైదరాబాద్ లో అంబేద్కర్ మహాగర్జనకు ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ గర్జనకు ప్రకాష్ అంబెద్కర్, జజ్ఞేష్ మేవాని, ఖర్గే, మీరాకుమారి, బీమ్ ఆర్మీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ వస్తారని తెలిపారు. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ గర్జన కు వస్తాయన్నారు. అంబెడ్కర్ ను అవమానించిన చంద్రశేఖర్ రావు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

war began again..manda krishna targeting kcr.. mahagarjana on 27th..!!

ఎన్ని నిర్భందాలు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని మంద క్రిష్ణ పేర్కొన్నారు. అంబెడ్కర్ మాకు దేవుడని, 22వ తేది వరకు ఎంఆర్పీఎస్ ఇచ్చిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను ప్రశ్నించడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంబెద్కర్ ను గౌరవించని వ్యక్తులలో చంద్రశేఖర్ రావు మొదటి వాడని విమర్శించారు. అంబెద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తిస్తుoటే, చంద్రశేఖర్ రావు ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి అంబెద్కర్, పూలే, జగ్ జీవన్ రావు, కొండ లక్ష్మణ్ బాపూజీకు ఎప్పుడూ కనీసం పూలదండ కూడా వేయలేదన్నారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు., తదితరులు పాల్గొన్నారు.

English summary
Manda Krishna is also designed for programs that have been used as a protest against the Chief Minister. MRPS leaders called for the Ambedkar Mahagarjana in Hyderabad on 27th May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X