• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Warangal 9 murders case ... ఆ నిద్రమాత్రలు అమ్మిందెవరు? మెడికల్ షాప్ విషయంలో గుట్టు దేనికి ?

|

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ 9 హత్యల ఉదంతంలో ఇంకా చాలా అంశాలు వెలుగులోకి రావలసి ఉంది.వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుబడిన బావిలో తొమ్మిది మందిని పడేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు మృతులందరికీ ఆహారంలో నిద్రమాత్రలు కలిపి నిద్రలోకి జారుకున్న తరువాత హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇన్ని మాత్రలను ఏ షాప్ లో కొనుగోలు చేశాడనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాకపోవడం ఈ కేసుపై ఆసక్తిని పెంచుతుంది.

9మంది వలస కార్మికుల డెత్ మిస్టరీ .. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు

 నిద్రమాత్రలు విక్రయించిన మెడికల్ షాప్ పేరు వెల్లడించని పోలీసులు

నిద్రమాత్రలు విక్రయించిన మెడికల్ షాప్ పేరు వెల్లడించని పోలీసులు

ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు నిలువునా తీశాడు నరహంతకుడు సంజయ్ కుమార్. వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితుడు సంజయ్ కుమార్ విచారణలో భాగంగా వరంగల్‌ చౌరస్తాలోని ఓ షాపులో నిద్ర మాత్రలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెబుతున్నా ఆ షాపు పేరు బహిర్గతం చేయడం లేదు పోలీసులు . ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు మెడికల్ షాప్ వాళ్ళు ఎలా ఇచ్చారు అన్నదానిపై అప్పటినుండి ఇప్పటివరకూ అందరిలో అనుమానాలున్నాయి.

 షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించటం నేరం

షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించటం నేరం

సదరు మెడికల్ షాప్ పేరు బహిర్గతం చేసి వారిపై కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎందుకు మెడికల్ షాప్ పేరు బయటకు బహిర్గతం చేయడం లేదు అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న ప్రశ్న. దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ రాయకుండా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఇవ్వడం ఏమాత్రం వీలు లేదు. ఒకవేళ ఎవరైనా అలా విక్రయాలు జరిపితే వారిపై కేసు నమోదు చేయవచ్చు.

బ్యాచ్ నంబర్ చెప్తే మెడికల్ షాప్ గుర్తిస్తామంటున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు

బ్యాచ్ నంబర్ చెప్తే మెడికల్ షాప్ గుర్తిస్తామంటున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు

ఇక వరంగల్ 9 హత్యల కేసులో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండానే షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే నిందితుడు కొనుగోలు చేసిన 60 నిద్రమాత్రలు ఓకే షాప్ లో కొనుగోలు చేశాడా లేక వేర్వేరు షాపుల్లో కొనుగోలు చేశాడా అనేది కూడా పోలీసులు వెల్లడించలేదు. ఇక దీనికి సంబంధించి నిందితులు ఉపయోగించిన నిద్రమాత్రలు బ్యాచ్ నెంబర్ తమకు తెలియజేస్తే ,బ్యాచ్ నెంబర్ ఆధారంగా అది ఏ షాప్ నుండి విక్రయించబడింది అనేది తెలుసుకోవచ్చని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. ఇక బ్యాచ్ నెంబర్ సైతం చెప్పాలని పోలీసులను తాము కోరామని వారు అంటున్నారు.

రేపటితో ముగియనున్న సంజయ్ కుమార్ యాదవ్ కస్టడీ ..

రేపటితో ముగియనున్న సంజయ్ కుమార్ యాదవ్ కస్టడీ ..

ఇక నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. 6 రోజుల కస్టడీ ఈనెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో రేపు నిందితుడిని కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. వరంగల్ 9 హత్యకేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడి ద్వారా మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాత్రి సమయాల్లో సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి అన్ని వివరాలు సేకరిస్తున్నారు.

  Telangana Formation Day : Man Stops KCR Convoy
  సస్పెన్స్ గా నిద్రమాత్రల కొనుగోలు వ్యవహారం

  సస్పెన్స్ గా నిద్రమాత్రల కొనుగోలు వ్యవహారం

  అయితే ఇప్పటివరకు నిద్రమాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడు ? ఆ షాపుపై పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? నిద్ర మాత్రలు విక్రయించిన మెడికల్ షాప్ వివరాలు ఎందుకు బయట పెట్టటం లేదు? అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. ఇక ఈ క్రైమ్ స్టోరీని కళ్ళకు కట్టినట్టు చెప్పిన పోలీసులు మెడికల్ షాప్ వ్యవహారం ఇంకా గుట్టుగానే ఉంచడం వెనుక మతలబు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

  English summary
  The accused Sanjay Kumar Yadav is currently in police custody. The accused is scheduled to appear in court tomorrow as the 6-day custody ends on june 4, police said.Police have not revealed the medical shop name that who sold the scheduled H drug sleeping pils to the accused.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more