వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్త్ హబ్ గా వరంగల్; మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి స్పీడందుకున్న పనులు.. ఏం జరుగుతుందంటే!!

|
Google Oneindia TeluguNews

వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. జనవరి మొదటి వారంలో నిర్మాణాలు ప్రారంభించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించతలపెట్టిన వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి పదకొండు వందల కోట్లతో పరిపాలన అనుమతులను ఇస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేయడానికి రంగంలోకి దిగనుంది.

ఇక ఇదే విషయాన్ని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కేసీఆర్ ఆశిస్తున్న ఆరోగ్య తెలంగాణా సాకారం చెయ్యటం కోసం అందరూ కలిసి పని చెయ్యాలన్నారు మంత్రి హరీష్ రావు.

వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చి దిద్దే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రంగం సిద్ధం

వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చి దిద్దే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రంగం సిద్ధం

వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చి దిద్దటంలో భాగంగా నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో నూతనంగా నిర్మించే 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ నలువైపులా నిర్మించే నాలుగు టిమ్స్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్ధాపన చేస్తారన్నారు మంత్రి హరీష్ రావు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

8 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలన్న మంత్రి హరీష్ రావు

8 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలన్న మంత్రి హరీష్ రావు

మెడికల్ కాలేజీల నిర్మాణం పై బీ అర్ కే భవన్ లో ఆరోగ్య, అర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయా కాలేజీలకు సంబందించిన డిజైనింగ్ ఏజెన్సీలు, మరియు అధికారులతో సమీక్ష జరిపారు. కాలేజీల నమూనాలను సి ఎస్, హెల్త్ సెక్రెటరీ, సంబంధిత ఇతర వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే రాష్ట్రానికి మెడికల్ హబ్ గా మారుతుందని హరీష్ రావు వెల్లడించారు. ఇదే సమయంలో 8 నూతన మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే మారు మూల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు.

నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీల నిర్మాణం

నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీల నిర్మాణం

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని మంత్రి హరీష్ రావు సూచించారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీల నిర్మాణం ఉండాలన్నారు. స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట డిజైన్లు ఎన్ ఎం సి నిబంధనల ప్రకారం రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. వైద్యాధికారులు, ఇంజినీరింగ్ విభాగం, ఎన్ ఎం సి నిబంధనల మేరకు మరోసారి మంగళవారం సమీక్షించుకుని పూర్తి స్థాయి నమూనాలను, అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించే మెడికల్ కాలేజీలు

ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించే మెడికల్ కాలేజీలు

నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక పద్ధతులతో, మెరుగైన వైద్య సదుపాయాలు ఉండేలా ఆసుపత్రులను రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కలలను సాకారం చేసే విధంగా ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అన్ని కళాశాలల నమూనాలను వీక్షించిన హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆ దిశగా అడుగులు వేస్తుందని వెల్లడించారు.

టిమ్స్ తరహాలో హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్

టిమ్స్ తరహాలో హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్

ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు టిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. గచ్చిబౌలి, స‌త‌న్‌న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్‌, అల్వాల్ లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని పేర్కొన్నారు . ఒక్కొక్కటి 1000 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

Recommended Video

శరవేగంగా మస్తాబవుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం!!
మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు

మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు

ఆయా ప్రాంతాల్లో ఉన్న కంటోన్మెంటు, ఎయిర్ పోర్టు ఇతర సంస్థల నిబంధనలు కూడా పరిగణలోకి తీస్కొని నమూనాలు తయారు చేయాలని కోరారు మంత్రి హరీష్ రావు. పల్లె దవాఖానాల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయన్నారు మంత్రి హరీష్ రావు . దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే వైద్య సేవలు అందించడం సాధ్యం అవుతుందని వెల్లడించారు.

English summary
Medical Health Minister Harish Rao has directed the Warangal Multi-Specialty Hospital to complete the tender process by the end of this month. Construction is scheduled to begin in the first week of January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X